భార్యతో సినిమాను స్టార్ట్ చేస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్.. అగ్ర హీరోతో భారీ బడ్జెట్..
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాతగా కూడా మారుతున్నాడు. అయితే ఆ విషయంలో మాటల మాంత్రికుడు చాలా తెలివిగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం సినిమాలు డైరెక్ట్ చేయడమే కాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు నిర్మాతగా తనదైన శైలిలో ఎంతో కొంత పెట్టుబడి పెడుతూ వస్తున్నారు. బిగ్ స్టార్ హీరోతో ద్విభాషా చిత్రాన్ని చేసేందుకు ఇటీవల ఒప్పందం చేసుసుకున్నాడు. ఆ హీరో మరెవరో కాదు.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.

మహేష్ బాబుతో మూవీ..
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలాంటి సినిమాను తెరపైకి తీసుకు వచ్చినా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా డైరెక్ట్ చేస్తాడు అని అందరికీ తెలిసిన విషయమే. చివరగా వచ్చిన అల వైకుంఠపురములో సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ తర్వాత అంతకు మించి అనేలా ప్రేక్షకులను మెప్పించాలని మహేష్ బాబుతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఆ సినిమాతో బిజిగా..
మహేష్ బాబు కోసం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటికే పూర్తి స్థాయిలో కథను సిద్ధం చేసి ఉంచాడు. సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో మొదలవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఇంకా ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ భీమ్లా నాయక్ సినిమా పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాకు దర్శకుడు కాకపోయినప్పటికీ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తూ అన్ని పనులను దగ్గరుండి చూసుకున్నాడు.

సినిమాల్లోకి సౌజన్య శ్రీనివాస్
అయితే ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రొడక్షన్ హౌస్ లోకి కూడా అడుగు పెట్టినట్లు క్లారిటీ ఇచ్చేశాడు. ఆ సంస్థకు తన పేరు కాకుండా సతీమణి పేరు పెట్టడం విశేషం. త్రివిక్రమ్ భార్య సౌజన్య శ్రీనివాస్ గురించి అందరికీ తెలిసిందే. ఆమె క్లాసికల్ డాన్సర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నారు. అయితే రీసెంట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి దానికి మెయిన్ హెడ్ గా సౌజన్య శ్రీనివాస్ ను నియమించారు.

నవీన్ పోలిశెట్టితో సినిమా..
ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పేరుతో త్రివిక్రమ్ సొంత బేనర్ మొదలైంది. ఇప్పటికే జాతిరత్నాలు హీరో నవీన్ పోలిశెట్టి తో ఒక సినిమా చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు జాతి రత్నాలు మూవీ అసిస్టెంట్ డైరెక్టర్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. అలాగే మరో రెండు ప్రాజెక్టులపై కూడా చర్చలు జరుపుతున్నారు.

ధనుష్ తో బిగ్ మూవీ
ఈరోజు ధనుష్ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేశారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'సర్' అనే సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నారు. హారిక హాసిని అనుబంధ సంస్థ అయినటు వంటి సితార ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సొంత బ్యానర్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ను కూడా జత చేశారు. ఇక ఈ సినిమాకి నిర్మాతగా సౌజన్య శ్రీనివాస్, నాగ వంశీ ఉన్నట్లు ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. మరి నిర్మాతగా త్రివిక్రమ్ ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











