Pawan Kalyan గురించి త్రివిక్రమ్ భార్య ఆసక్తికర వ్యాఖ్యలు.. మా ఆయన ఎవరికి ఇవ్వనిది పవన్‌కు ఇచ్చారు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు అని అందరికీ తెలిసిందే. జల్సా సినిమా కంటే ముందే వీరిద్దరూ కూడా ఎంతో స్నేహంగా కొనసాగుతున్నారు.

ఒక విధంగా చెప్పాలి అంటే మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని కూడా చెప్పవచ్చు. అయితే మొదటిసారి త్రివిక్రమ్ భార్య ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి భాహ్య ప్రపంచానికి కొన్ని విషయాలను తెలియజేశారు. అంతేకాకుండా త్రివిక్రమ్ జీవితంలో ఎవ్వరికి ఇవ్వనిది పవన్ కళ్యాణ్ కు ఇచ్చారు అని కూడా ఆమె వివరణ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

అప్పటి నుంచి

అప్పటి నుంచి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరు కూడా మొదటిసారి జల్సా సినిమా తో చాలా క్లోజ్ అయ్యారు అంతకుముందు పవన్ తోనే అతడు సినిమా చేయాలని అనుకున్నప్పటికీ కుదరలేదు. ఇక జల్సా సినిమాతో వీరి మధ్య స్నేహం అలా కొనసాగుతూనే ఉంది.

ఇక తర్వాత అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి వరకు వీరి కాంబినేషన్లో సినిమాలు వచ్చాయి.. ఇక ఇప్పటికి పవన్ కళ్యాణ్ సినిమాలకు ఆయన రచన సహకారంతో ముందుకు సాగుతున్నారు.

స్నేహం గురించి

స్నేహం గురించి

ఇక పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ స్నేహం గురించి ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా కూడా ఎంతో వివరంగా చెబుతూ ఉంటారు. అయితే త్రివిక్రమ్ సతీమణి సౌజన్య కూడా మొదటి సారి పవన్ కళ్యాణ్ గురించి ఎవరికి తెలియని విషయాలను ఆమె తెలియజేశారు. అంతేకాకుండా త్రివిక్రమ్ పవన్ ఇద్దరు కూడా ఎంత స్నేహంగా ఉంటారు అని కూడా ఆమె వివరణ ఇవ్వడం విశేషం.

కలిస్తే వాటి గురించి మాట్లాడుకుంటారు

కలిస్తే వాటి గురించి మాట్లాడుకుంటారు

సౌజన్య మొదట ఒక క్లాసిక్ డ్యాన్సర్. ఇక ప్రస్తుతం నిర్మాతగా కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పవన్ గురించి మాట్లాడుతూ ఆయన స్నేహం గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ త్రివిక్రమ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఒకరికొకరు ఎంతో గౌరవంగా మెసులుకుంటారు అని అన్నారు. అంతేకాకుండా ఎన్నో చారిత్రాత్మక అంశాల గురించి కూడా వాళ్ళు దీర్ఘంగా మాట్లాడుకుంటారని ఆమె తెలియజేశారు.

ఇష్టమైన ఆహారం

ఇష్టమైన ఆహారం

అలాగే సౌజన్య పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన ఆహారపు అలవాట్ల గురించి కూడా తెలియజేశారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా తనకు ఇష్టమైన వాటిని అడిగిమరీ చేయించుకుంటాడు. ముఖ్యంగా మా ఇంట్లో చేసే ఉప్మా అంటే ఎంతగానో ఇష్టం. ఇక పవన్ కళ్యాణ్ కు వెజిటేరియన్ ఫుడ్ ఏదైనా సరే చాలా ఇష్టం.. అని సౌజన్య తెలిపారు.

ఏమాత్రం సిగ్గుపడకుండా..

ఏమాత్రం సిగ్గుపడకుండా..

ఇక లంచ్ లో అయితే ఆవకాయ తప్పనిసరిగా ఉండాలి. ఇక రవ్వ లడ్డు కూడా ఎంతగానో ఇష్టం. భోజనం విషయంలో పవన్ గారు ఏమాత్రం సిగ్గుపడకుండా అడిగి మరీ పెట్టించుకుని తింటారు. మా కుటుంబంలో పవన్ కళ్యాణ్ గారు ఒక సభ్యుడిగా ఉంటారు.. అని సౌజన్య వివరణ ఇచ్చారు.

పవన్ కు మాత్రమే ఇస్తారు..

పవన్ కు మాత్రమే ఇస్తారు..

అంతేకాకుండా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ స్నేహం చాలా గొప్పది అంటూ తన జీవితంలో త్రివిక్రమ్ ఎవరికీ కూడా పుస్తకాలు పెన్నులు కూడా కానుకగా ఇవ్వరు. కానీ పవన్ కళ్యాణ్ కోసం మాత్రం ఆయన ప్రత్యేకంగా కొన్ని పుస్తకాలు షేర్ చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ కి తప్పితే ఆయన ఎవరికీ కూడా పుస్తకాలు ఇవ్వరు. ఆ విధంగా ఇద్దరి మధ్యలో ఎంతో అర్థవంతమైన స్నేహం కొనసాగుతోంది అని సౌజన్య తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X