‘వినయ విధేయ’పై ట్రోలింగ్ ఎఫెక్ట్: ఆ సీన్లు కట్.. చిరంజీవి చూసి ఏమన్నారంటే.. ఇక ఆ భాషల్లోకి చెర్రీ

రంగస్థలం లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కియారా అద్వానీ, ప్రశాంత్, స్నేహ తదితరులు నటించిన చిత్రంపై మిశ్రమ స్పంద

రంగస్థలం లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కియారా అద్వానీ, ప్రశాంత్, స్నేహ తదితరులు నటించిన చిత్రంపై మిశ్రమ స్పందన వ్యక్తమైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లు సాధిస్తున్నది. అయితే ఈ చిత్రాన్ని మలయాళ, తమిళ భాషల్లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

మలయాళ, తమిళంలోకి

మలయాళ, తమిళంలోకి

మెగా హీరోలకు మలయాళ, తమిళ భాషల్లో మార్కెట్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకుల ఆదరణను దృష్టిలో పెట్టుకొని వినయ విధేయ రామ చిత్రాన్ని ఫిబ్రవరి తొలివారంలో ఈ రెండు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. గతంలో మెగా హీరోల సినిమాలు రికార్డు కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే.

భారీ మొత్తానికి హక్కులు

భారీ మొత్తానికి హక్కులు

వినయ విధేయ రామ చిత్రాన్ని ప్రముఖ పంపిణిదారు ప్రకాశ్ ఫిలింస్ రిలీజ్ చేయనున్నది. ఈ సినిమా హక్కులను భారీ మొత్తానికి దక్కించుకొన్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని ఏకకాలంలో మలయాళం, తమిళంలో రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. డబ్బింగ్‌కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్టు సమాచారం.

ఆ సీన్లపై భారీగా కత్తెర

ఆ సీన్లపై భారీగా కత్తెర

వినయ విధేయ రామ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలపై నెటిజన్లు సోషల్ మీడియాలో భారీగా దాడి చేశారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకొని ట్రైన్ సీన్లు, మరికొన్ని సన్నివేశాలను తొలగించినట్టు తెలిసింది. దాంతో సినిమాపై నెగిటివ్ ప్రభావం తగ్గినట్టు తెలుస్తున్నది.

బోయపాటికి చిరంజీవి ప్రశంస

సెకండాఫ్‌లో కొన్ని సీన్లు తొలగించిన తర్వాత ఇటీవల హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో మెగాస్టార్ చిరంజీవితో కుటుంబ సభ్యులు వినయ విధేయ రామ సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను టేకింగ్‌, మాస్ ఎలిమెంట్స్‌ను ప్రశంసించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X