Bhola Shankar: చిరంజీవిపై పేలుతున్న ట్రోల్స్.. కొరటాల శివ రియాక్షన్ ఇదే!
ఎంతోకాలంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సందడి చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే సినిమాల్లోకి రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి చూసిన అతిపెద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ ఆచార్య. ఇందులో రామ్ చరణ్ తోపాటు చిరంజీవి నటించిన ప్రేక్షకులకు ఏమాత్రం మెప్పించలేకపోయింది.
దీంతో ఆ సమయంలో డైరెక్టర్ కొరటాల శివపై బీభత్సమైన నెగెటివిటీ వచ్చింది. సినిమా ప్లాప్ కు కారణం దర్శకుడే అన్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా విడుదలైన భోళా శంకర్ సినిమాపై తెగ ట్రోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొరటాల శివ రియాక్షన్ ఇదేనంటూ చర్చ జరుగుతోంది.

చెల్లెలుగా: మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం భోళా శంకర్. పదేళ్ల క్రితం తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వేదాళం సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో చిరుకు జోడాగీ మిల్కీ బ్యూటి తమన్నా, చెల్లెలుగా మహానటి కీర్తి సురేష్ నటించారు. హీరో సుశాంత్ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాకు మెహర్ రమేశ్ దర్శకత్వం వహించారు.

పెద్ద తారాగణమే: ఏకే ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర సమర్పణలో అనిల్ సుంకర నిర్మించిన భోళా శంకర్ సినిమాలో రావు రమేష్, మురళి శర్మ, రవి శంకర్, రఘు బాబు, వెన్నెల కిశోర్, శ్రీముఖి, బిత్తిరి సత్తి, ప్రగతి, రష్మీ గౌతమ్, తరుణ్ అరోరా, గెటప్ శ్రీను, కాశీ విశ్వనాథ్, సితార, ఉత్తేజ్, ప్రభాస్ శీను వంటి పెద్ద తారాగణమే ఉంది.

సిస్టర్ సెంటిమెంట్: సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంశంగా వచ్చిన భోళా శంకర్ మూవీ ఆగస్ట్ 11న ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ సినిమాపై ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. బ్రిటిష్ కాలం నాటి స్టోరీతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారని పలు రివ్యూలు చెబుతున్నాయి. ఇక ఇందులో మిగతా సినిమాల్లోని స్ఫూఫ్ వీడియోలు కూడా అంతగా వర్కౌట్ కాలేదని అంటున్నారు.
జోరుగా వీడియోలు: ఇప్పటికే భోళా శంకర్ సినిమాలోని పలు సీన్స్ నెట్టింట్లో వైరల్ కాగా వాటిపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. రకరకాల వీడియోలు, ఎక్స్ ప్రెషన్స్, క్యాప్షన్లతో భోళా శంకర్, చిరంజీవిపై ట్రోలింగ్ దిగారు మీమర్స్. ఇందులో భాగంగానే ఆచార్య వంటి బిగ్గెస్ట్ ప్లాప్ ఎదుర్కున్న కొరటాల శివ రియాక్షన్ ఇదేనంటూ జోరుగా వీడియోలు పెడుతున్నారు. అయితే అప్పట్లో ఆచార్య ఓటమికి శివనే కారణమన్నట్లుగా చిరు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
దేవర-స్పైడర్: చిరంజీని భోళా శంకర్ సినిమా ఫలితంపై దేవర మూవీ లాంచ్ కార్యక్రమంలో కొరటాల శివ తన హెయిర్ ను సరిదిద్దుకునే వీడియోను తగిలించారు. అలాగే మహేశ్ బాబు స్పైడర్ మూవీలో అందరూ (మెగా అభిమానులు) ఏడుస్తుంటే విలన్ సంతోషించే వీడియోను పెట్టి ట్రోలింగ్ చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో భోళా మేనియా నడుస్తోంది. కానీ, అది పాజిటివ్ గా కాకుండా ట్రోలింగ్ ద్వారా ట్రెండ్ అవుతోంది.


Click it and Unblock the Notifications











