ఇండియన్ ఆర్మీని అవమానించిన సరిలేరు టీమ్.. నెటిజన్స్ ఫైర్

మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తోన్న సరిలేరు నీకెవ్వరుచిత్రంపై ఎంతటి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే సూపర్ స్టార్ వరుస విజయాలతో దూసుకుపోతుండగా.. హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. మరోవైపు అపజయం అంటే ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి ఈచిత్రాన్ని సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కే కాకుండా.. సగటు సినీ అభిమాని ఇష్టపడే విధంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

టీజర్, పోస్టర్లతో హంగామా..

టీజర్, పోస్టర్లతో హంగామా..

ఈ మూవీ పోస్టర్స్, మహేష్ స్టిల్స్ ఏ రేంజ్‌లో వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇవన్నీ ఒకెత్తు అనుకుంటే.. టీజర్‌తో సోషల్ మీడియాను షేక్ చేసి అవతల పారేశారు. టీజర్‌లో మహేష్ మ్యానరిజం, కామెడీ టైమింగ్, యాటిట్యూడ్ ఇలా ప్రతీ ఒక్కటి అభిమానులనే కాక సినీ లవర్స్‌ను మెస్మరైజ్ చేశాయి.

భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్..

భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్..

జనవరి 5న ఎల్బీ స్టేడియంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతోన్నట్లు ప్రకటించారు. తనకు కలిసి వచ్చిన ఆ స్టేడియంలో ఈ మూవీ ఈవెంట్‌ను చేయాలని మహేష్ భావించాడు. భరత్ అనేనేను ఈవెంట్‌ను అక్కడే జరపగా.. ఆనాడు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.అయితే ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి హాజరుకాబోతోన్నాడు. మెగాస్టార్‌ను దించి మెగా ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేందుకు భారీ ప్లాన్ వేశారు.

వారానికో పాట..

వారానికో పాట..

ఈ మూవీలోని పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ప్రతీ సోమవారం ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు మైండ్ బ్లాక్, సూర్యుడివో, హీ ఈజ్ సో క్యూట్ అనే పాటలను విడుదల చేశారు. అయితే రేపు టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేయబోతోన్నట్లు ప్రకటించారు. అంతా బాగానే ఉన్నా ఇక్కడే మొదలైంది అసలైన చిక్కు.

ఆర్మీ బృందంలో లోపం..

ఆర్మీ బృందంలో లోపం..

భారత ఆర్మీకి ట్రిబ్యూట్‌గా ఓ పాటను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అందులో భాగంగా ఓ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే విడుదలైన ఆ పోస్టర్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ పోస్టర్ లో ఓ వ్యక్తి గుబురు గడ్డంతో ఇండియన్ ఆర్మీ డ్రెస్‌లో ఉన్నాడు. దీంతో అసలు ఆర్మీలో ఇలాంటి వ్యక్తులు ఉంటారా? పోస్టర్ రిలీజ్ చేసేముందు ఆ మాత్రం జాగ్రత్త తీసుకోరా? అంటూ భారత ఆర్మీను సరిలేరు నీకెవ్వరు టీం అవమాన పరిచిందని ఫైర్ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X