పుష్ప 2 రిలీజ్.. రాజమౌళిని ఏకీపారేస్తోన్న నెటిజన్లు , ఆ వ్యాఖ్యలు దెబ్బకొట్టాయా?

తెలుగు చిత్ర పరిశ్రమను ప్రపంచ స్థాయికి చేర్చిన మహా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. తన విజన్ , సృజనాత్మకత, మార్కెటింగ్ టెక్నిక్స్‌తో తన సినిమాలకు వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు జక్కన్న. పాన్ ఇండియా సినిమాలకు బాటలు వేసి.. బాలీవుడ్‌ను షేక్ చేసిన ట్రెండ్ సెట్టర్‌గా రాజమౌళికి పేరు. 20 ఏళ్లకు పైగా కెరీర్‌లో ఓటమి ఏరుగని దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న జక్కన్న.. కొత్త సినిమాల రిలీజ్ సమయంలో తనదైన శైలిలో రివ్యూలు ఇస్తుంటారు.

కాగా.. అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫాహద్ ఫాజిల్ నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూడేళ్ల క్రితం రిలీజైన పుష్ప పార్ట్ 1కి సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మధ్యకాలంలో ఏ సినిమా కోసం కూడా యావత్ దేశం ఈ స్థాయిలో ఎదురుచూడలేదంటే అతిశయోక్తి కాదు. ఎన్నో అంచనాల మధ్య పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారత్‌లోని కొన్ని ప్రాంతాలు, ఓవర్సీస్‌లో పుష్ప 2 ప్రీమియర్స్ ద్వారా ముందే చూసేశారు.

trolling on ss rajamouli in social media over allu arjun introduction scene in pushpa 2

పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో పుష్ప 2 దుమ్మురేపుతోంది. అల్లు అర్జున్ ఈ సినిమాను వన్ మేన్ షోగా భుజాలపై మోశాడని విశ్లేషకులు చెబుతున్నారు. సినిమా చూస్తున్నంతసేపు పుష్పరాజే కనిపిస్తాడు తప్పించి బన్నీ కనిపించడంటే అతను ఎంతలా మెస్మరైజ్ చేశాడో అర్ధం చేసుకోవచ్చు. డీ గ్లామర్ రోల్‌లో చిత్తూరు యాస మాట్లాడుతూ.. నోట్లో కిళ్లి లాంటిది ఏదో పెట్టుకుని తనదైన మేనరిజమ్స్ చూపించాడు.

అన్నింటికి మించి ఫస్ట్ పార్ట్ మించి యాక్షన్ సీక్వెన్స్, డ్యాన్స్‌లు, ఫైట్స్‌ని అల్లు అర్జున్ ఇరగదీశాడని నెటిజన్లు అంటున్నారు. ముఖ్యంగా జాతరలో అమ్మవారి గెటప్‌లో చేసే డ్యాన్స్ ఎపిసోడ్, రౌడీల మెడలను కొరికి అంతం చేసే సీన్స్‌లో అల్లు అర్జున్న ఉగ్ర రూపం చూపించాడని ప్రశంసిస్తున్నారు. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎంట్రీ సీన్‌పై విమర్శలు వస్తున్నాయి. కానీ ఈ సినిమా అదిరిపోతుందని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చెప్పిన ప్రిడిక్షన్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ఇదొక్కటే కాదు.. గతంలో రాజమౌళి ఇతర సినిమాల విషయాల్లో చేసిన వ్యాఖ్యలను బయటికి తీస్తున్నారు. రాజమౌళి హైప్ కోసం చేసే వ్యాఖ్యలు సినిమా రిలీజ్ అయ్యాక మ్యాచ్ కావడం లేదంటూ విమర్శలు వస్తున్నాయి. జపాన్‌లో హీరో అల్లు అర్జున్ ఇచ్చే ఇంట్రడక్షన్ సీన్ చాలా నార్మల్‌గా ఉంటుంది. 40 రోజుల పాటు నీళ్లు, ఆహారం లేకుండా కంటైనర్‌లో జపాన్ వరకు వెళ్లే హీరో అక్కడ అడుగుపెట్టగానే 100 మందిని చితక్కొట్టడటం అతిగా ఉందంటూ ట్రోలింగ్ జరుగుతోంది. మరి దీనిపై రాజమౌళి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X