Bro: తమన్‌పై మళ్లీ మొదలైన ట్రోలింగ్.. 'జాణవులే' ఆ పాటకు కాపీనా బ్రో?
ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆయన మ్యూజిక్, బీజీఎమ్ సినిమాకు ఎంత హైలెట్ అవుతుంటాయో తెలిసిందే. అయితే కొన్నిసార్లు అదే మ్యూజిక్, బీజీఎమ్ పై తీవ్రమైన విమర్శలు, ట్రోలింగ్ ఎదుర్కున్నారు. ఇక ఇటీవల గుంటూరు కారం నుంచి తీసేసారని జోరుగా టాక్ నడిచింది. కానీ, అందులో నిజం లేదని తర్వాత క్లారిటీ వచ్చింది. ఇదిలా ఉంటే తమన్ పై మరోసారి ఘోరంగా ట్రోలింగ్ మొదలైంది.
భారీ అంచనాలు:మెగా హీరోలు, మామ అల్లుళ్లు అయిన పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ తొలిసారిగా కలిసి నటించిన చిత్రం బ్రో (Bro Movie). వినోదయ సీతమ్ రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నటుడు, డైరెక్టర్ సముద్ర ఖని దర్శకత్వం తెరకెక్కించారు. తెలుగులో వస్తున్న బ్రో మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్, సాంగ్స్ భారీ అంచనాలు పెరిగేలా చేస్తున్నాయి.

నెటిజన్లు ఫైర్:బ్రో సినిమా నుంచి ఇదివరకు మై డియర్ మార్కండేయ పాట విడుదల కాగా.. ఇటీవల జాణవులే అనే రెండో వీడియో లిరికల్ సింగిల్ రిలీజైంది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయినా ఈ పాటకు మిశ్రమ స్పందన లభిస్తోంది. కానీ, గాయనీ ప్రణితి వాయిస్ కు మంచి మార్కులు పడుతున్నాయి. అయితే ఈ పాటకు మ్యూజిక్ అందించిన తమన్ పై నెటిజన్లు తెగ ఫైర్ అవుతున్నారు. ఆయన కెరీర్ లోనే వరెస్ట్ ఆల్బమ్ అంటూ మండిపడుతున్నారు.
కాపీ కొట్టావా?:పవన్ కల్యాణ్ సినిమాకు మ్యూజిక్ ఎలా ఉండాలి అంటూ తమన్ కు సలహాలు కూడా ఇస్తున్నారు నెటిజన్లు. అంతేకాకుండా జాణవులే అనే పాట ప్రముఖ హిందీ ర్యాప్ సింగర్ బాద్ షా గెండా పూల్ కు కొంచెం దగ్గరగా ఉందని విమర్శిస్తున్నారు. ఇదివరకు చాలా సాంగ్స్ కాపీ కొట్టినట్లు తమన్ విమర్శలు ఎదుర్కోగా ఈ పాటను కూడా బాలీవుడ్ సాంగ్ నుంచి కాపీ కొట్టావా? అంటూ నెట్టింట్లో చర్చ పెడుతున్నారు. దీంతో ఈ ట్రోలింగ్ పై తమన్ తాజాగా స్పందించారు.

అంతకుమించి కొట్టలేం:"ముందు నుంచి ట్రోల్స్ ఎవరు అయితే చేస్తున్నారో వాళ్లే ఇప్పుడు చేస్తున్నారు. ఈరోజు కొత్తగా ఎవరు రాలేదు. ఇక మార్కండేయ పాట తేజ్ సాంగ్. అందులో పవన్ కల్యాణ్ వస్తారు. ఆ సందర్భానికి అంతకు మించి కొట్టలేం. బ్రో సినిమాలో పాటలకు ఎక్కువ స్కోప్ లేదు" అన్నట్లుగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చెప్పుకొచ్చారు.

జూలై 28న:కాగా బ్రో సినిమాను జీ స్టూడియోస్ సమర్పణలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించగా.. బ్యూటిఫుల్ కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఇక ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











