డ్రిపెషన్ లోకి వెళ్లితే గ్లామర్ పెరుగుతుందా? ఆంధ్ర హాట్ పికిల్ రమ్య అంటూ.. వామ్మో

యూట్యూబర్, అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య కంచర్ల గురించి ఇప్పుడు స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఈమె పేరు సోషల్ మీడియాలో మొన్నటి వరకు గట్టిగానే వినిపించిన సంగతి తెలిసిందే. ముగ్గురు అక్కాచెల్లెళ్లు అలేఖ్య చిట్టి పచ్చళ్ల వ్యాపారంతో ఫేమస్ అయ్యారు. వారి బిజినెస్ ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో జోరుగానే నడిపిస్తున్నారు. రకరకాల నోరూరించే పచ్చళ్లతో బాగా పేరు సంపాదించారు. మంచి క్వాలిటీని అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఇన్ స్టా గ్రామ్ వేదికన, యూట్యూబ్ వేదికన తమ పికిల్స్ కు సంబంధించిన ప్రమోషన్స్ ను నిర్వహించిన సంగతి అందరికి తెలిసిందే.

ఈ క్రమంలోనే అలేఖ్య చిట్టి పికిల్స్ పేరు జనాల్లోకి బాగా వెళ్లింది. అయితే అంతా సరిగానే సాగుతుందనుకున్న సమయంలో వీరికి ఊహించని షాక్ తగిలింది. అలేఖ్య చిట్టి పికిల్స్ కు సంబంధించిన ఓ బూతు పురాణం ఆడియో లీక్ అయ్యింది. వారి అఫీషియల్ ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో అసభ్యంగా కామెంట్ పెట్టిన ఒక యూజర్ కు ఆ ఆడియోను పంపించాల్సి ఉంది. అయితే పొరపాటున వేరు అతని వెళ్లిందని, దాంతో సోషల్ మీడియాలోకి చేరిందని వారు చెప్పుకొచ్చారు. ఇక ఆ ఆడియోను విన్న తర్వాత వారిపై తీవ్రమైన విమర్శలు వచ్చారు. భారీ ట్రోల్స్ ను ఎదుర్కొన్నారు. రమ్య వాళ్ల అక్కా చెళ్లెలు ఈ వివాదంపై మాట్లాడే ప్రయత్నం చేశారు.

Trolls against Alekhya Chitti Pickles Ramya

దారుమైన ట్రోల్స్ మధ్య తమ వెర్షన్ ను మాత్రం వినిపించారు. ఎంతైనా ఒక వ్యక్తిని మహిళా ఇంత దారుణంగా తిట్టడం ఏమాత్రం సరికాదని అందరూ మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికన దుమ్మేత్తిపోశారు. ఈ క్రమంలోనే రమ్య కంచర్ల డిప్రెషన్ లోకి వెళ్లిందని, తనకు చికిత్స అందుతోందని తోబుట్టువులు చెప్పుకొచ్చారు. దీంతో కాస్తా సానుభూతి వ్యక్తమైంది. కానీ తాజాగా రమ్య కంచర్ల చేసిన పనికి మళ్లీ ట్రోల్స్ మొదలయ్యాయి. ఆమె పంచుకున్న వీడియోను నెట్టింట షేర్ చేస్తూ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

అయితే, తాజాగా రమ్య కంచర్ల ఇన్ స్టా గ్రామ్ రీల్ చేసింది. జోరు పాటకు ఘాటుగా ఫోజులిస్తూ నటించింది. ఆ రీల్ ను సోషల్ మీడియాలో పంచుకోవడంతో మళ్లీ ట్రోల్స్ మొదలయ్యాయి. అసలు డిప్రెషన్ లోకి వెళ్లితే ఎవ్వరికైనా గ్లామర్ తగ్గుతుంది కానీ పెరుగుతుందా? అని ఆమె వీడియోను షేర్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే ఆంధ్ర హాట్ పికిల్ రమ్య అంటూ కామెంట్లు పెడుతూ.. ఎలాంటి సందర్భంలో ఎలాంటి వీడియోను తను పంచుకున్నది విమర్శిస్తున్నారు. దీంతో మళ్లీ అలేఖ్య చిట్టి పికిల్స్ ట్రోల్స్ కు మళ్లీ తెరలేచింది.

మరోవైపు ఇప్పటికే అలేఖ్య చిట్టి పికిల్స్ అలేఖ్య తను చేసిన తప్పునకు క్షమాపణలు కోరారు. అందరూ తనను క్షమించాలని, ఆ ఆడియో పొరపాటున వెళ్లిందని మరోసారి వివరించే ప్రయత్నం చేసింది. ఇదిలా ఉంటే.. అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపారం ప్రస్తుతం దెబ్బతిన్నది. త్వరగా ఈ సమస్య నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకోసమే రమ్య తన లేటెస్ట్ రీల్ ను పంచుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈమె పేరు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి వినిపిస్తుండటం కూడా ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X