Just In
- 7 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 8 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 8 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 9 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
మెజార్టీ ఉంటే ప్రజలను చంపాలని కాదు.. మోదీపై దీదీ గుస్సా..
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బాలయ్య చేతిలో చీపురుకట్ట.. రూలర్ కాదు క్లీనర్.. నెటిజన్ల ట్రోలింగ్‌తో పోస్టర్ వైరల్
నందమూరి బాలకృష్ణకు ఈ ఏడాది పీడకలను మిగిల్చి వెళ్లిపోతోంది. 2019 బాలయ్యకు మరపురాని సంవత్సరంగా గుర్తుండిపోతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించి, నిర్మించిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలు ఘోరమైన పరాభవాన్ని చవిచూశాయి. ఆర్థిక పరంగా కలిగిన నష్టాల కంటే.. నందమూరి అభిమానులకు కలిగిన నిరాశే ఎక్కువ. కనీసం ఏడాది చివర్లో రూలర్ చిత్రంతోనైనా హిట్ కొడతాడేమోనని అభిమానులు కలలు కన్నారు. కానీ అది కూడా పీడకలగానే మారిపోయింది.

దారుణంగా బెడిసికొట్టిన రూలర్..
జై సింహా కథా పరంగా ఔట్ డేటెడ్ అని అందరూ తేల్చి పడేసినా.. అప్పటి పరిస్థితులకు కమర్షియల్‌గా గట్టెక్కింది. జై సింహానే పాత చింతకాయ పచ్చడి అనుకుంటే.. రూలర్ దాని కంటే నాసిరకంగా తయారైంది. దీంతో రూలర్ నందమూరి అభిమానులను నిండా ముంచేసింది. బాలయ్య లుక్, విగ్‌లపై ఎన్ని రకాల జోకులు, మీమ్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

డిజాస్టర్ దిశగా..
బాలయ్య రూలర్ కలెక్షన్లు చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. ఫస్ట్ డే కలెక్షన్లు కాస్త పర్వాలేదనిపించినా.. అక్కడి నుంచి అసలు కథ మొదలైంది. ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.8.4 కోట్లు షేర్, రూ.14.80 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని సమాచారం. మొత్తంగా 23.75 కోట్ల బిజినెస్ జరిగిన ఈ సినిమాకు.. రూ.24.5 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. అంటే ఇంకా 16 కోట్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. అయితే ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
|
బాలయ్య గెటప్‌పై ట్రోల్స్..
బాలయ్య టోనీ స్కార్ట్ గెటప్, పోలిసాఫీసర్ పాత్రలో విగ్‌లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈవోగా ఉన్న బాలయ్యను అతి కష్టం మీద చూసిన ప్రేక్షకులు.. ధర్మ పాత్రలోని బాలయ్యను చూసి జీర్ణించుకోలేకపోయారు. అంతలా ఆ గెటప్ అందర్నీ భయపెట్టేసింది. బాలయ్య జూలపాలంపై అంతగా నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి.
|
తాజాగా మరో పోస్టర్..
ప్రస్తుతం బాలయ్య రూలర్‌కు సంబంధించిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రూలర్ చిత్రంలోని ఓ పాటకు బాలయ్య స్టెప్ వేసిన పోస్టర్‌కు చీపురు కట్టను తగిలించారు. అది సరిగ్గా సరిపోవడంతో ట్రోలింగ్స్ మొదలయ్యాయి. రూలర్ కాదు క్లీనర్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అసలే కలెక్షనలు లేవని అందరూ దిగాలుగా ఉంటే.. బాక్సాఫీస్ కలెక్షన్లను క్లీన్ చేసే రూలర్ అంటూ మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు.