కన్నప్ప మూవీపై అలాంటి ట్రోల్స్.. యూనిట్ కీలక నిర్ణయం
టాలీవుడ్ స్టార్ మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' చిత్రంతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే న్యూజీలాండ్ లో పూర్తి చేశారు. ప్రస్తుతం యూనిట్ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై పోయింది. మంచు విష్ణు కూడా సినిమాను భారీ ఎత్తున ప్రమోట్ చేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పలు ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమా గురించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నారు. కన్నప్ప చిత్రంపై అంతకంతకు అంచనాలను పెంచుతున్నారు. త్వరలో సినిమా రిలీజ్ కాబోతుండటంతో టీమ్ ప్రచార కార్యక్రమాలపైనా దృష్టి పెట్టింది.
అయితే, మొదటి నుంచే మంచు విష్ణు, మంచు ఫ్యామిలీ నుంచి వచ్చే సినిమాలు ట్రోల్స్ కు గురవుతుండటం బాధాకరం. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగానూ ట్రోల్స్ చేశారు కొందరు అపరిచితులు. వారిని నివారించేందుకు మంచు విష్ణు ఎంతో ప్రయత్నం చేశారు. మరోవైపు అలాంటి నీచమైన పనులు చేసే వారిని ఎప్పికప్పుడు మంచు విష్ణు హెచ్చరిస్తూనే వస్తున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. భారీ తారాగణంతో, హై బడ్జెట్ తో ఈ చిత్రాన్ని మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నండటం విశేషం.

కాగా, ఈ చిత్రం నుంచి మొదటి నుంచి వస్తున్న అప్డేట్స్ కు మంచి రెస్పాన్స్ వస్తున్నా.. మంచు విష్ణును కొందరు అకారణంగా టార్గెట్ చేసి సినిమాను ట్రోల్ చేస్తున్నారు. ఆ మధ్య విడుదైన టీజర్ లో మంచు విష్ణు నటనపై, మేకింగ్ పైనా విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత అక్షయ్ కుమార్ శివలింగాన్ని హత్తుకోవడంపైనా, ప్రభాస్ ను లాంగ్ హెయిర్ లో చూపించడంపైనా పలువురు ట్రోల్ చేశారు. వీటిపై ఎప్పటికప్పుడు మంచు విష్ణు మాత్రం ధీటుగా బదులిస్తూ ఖండిస్తూనే ఉన్నాడు. ట్రోలర్స్ ను కంట్రోల్ లో పెట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటూనే వస్తున్నారు.
అయినప్పటికీ కొందరు ట్రోలర్స్ మంచు విష్ణు 'కన్నప్ప' చిత్రాన్ని కావాలని ట్రోల్ చేస్తున్నట్టు టీమ్ భావించింది. తాజాగా ట్రోల్స్ చేస్తున్న వారిపై స్పందించింది... 'కన్నప్ప' చిత్రాన్ని ట్రోల్ చేసిన వారిని ఆ పరమశివుడే చూసుకుంటాడని, వారిందరూ ఆ శివయ్య ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఎవ్వరూ సినిమాపై ట్రోల్స్ చేసినా శివుడి శాపానికి గురవుతారంటూ సూచించారు. అయితే టీమ్ ట్రోలర్స్ కు ఇది స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా అనిపిస్తోంది. అనవసరంగా ట్రోల్స్ కు తెరలేపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇలా పరోక్షంగా చెప్పిన్నట్టు తెలుస్తోంది.
ఇక ఈ చిత్రాన్ని మంచు మోహన్ బాబు రూ.150 కోట్ల వరకు బడ్జెట్ వెచ్చించారు. నూజిలాండ్ లో షూటింగ్ మొత్తం జరగడం విశేషం. తిన్నడు పాత్రలో మంచు విష్ణు నటిస్తుండగా.. పరమశివుడిగా అక్షయ్ కుమార్, రుద్రగా ప్రభాస్, పార్వతీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండటం విశేషం. కిరాటగా మలయాళం హీరో మోహన్ లాల్ నటించారు. ఈ చిత్రానికి మహాభారతం సిరీస్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ లోనూ ఈ చిత్రం విడుదలకు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











