రష్మికని ఏకేస్తున్న నెటిజన్స్.. కొంప ముంచిన "పుష్ప 2" వేషం..
ఇపుడు భారతీయ చిత్ర పరిశ్రమ దగ్గర ఎక్కువగా వినిపిస్తున్న హీరో అండ్ హీరోయిన్ పేర్లు ఏవి అంటే ఖచ్చితంగా పాన్ ఇండియా బిగ్ స్టార్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే రష్మిక మందన్నాలే అని చెప్పాలి. ఈ ఇద్దరు కలిసి నటించిన మొదటి చిత్రం "పుష్ప 1" . కాగా వీరి కలయికలో వచ్చిన మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ పార్ట్ 2 కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో పార్ట్ 2 కోసం మరింత డోస్‌ని పెంచేశారు.
పోటాపోటీగా సాలిడ్ పెర్ఫామెన్స్ లు అందించారు అల్లు అర్జున్, రష్మిక. ఈ ఇద్దరి కెరీర్‌లోనూ పుష్ప 2 స్పెషల్ సినిమాగా నిలిచిపోతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇపుడు ఇదే రష్మిక మందన్నాపై ట్రోల్స్ తీసుకొచ్చేలా చేసింది. పుష్ప 2 చిత్రం నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన మొట్ట మొదటి ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అల్లు అర్జున్ ఒక ఊహించని గెటప్ వేసి అందరికీ షాకిచ్చాడు.

గంగమ్మ తల్లి జాతరలో ఆడవేషం కట్టి చేసిన ఈ పోస్టర్ నేషనల్ వైడ్ గా ఓ రేంజ్ లో వైరల్ అయ్యిపోయింది. అయితే ఓ టాప్ హీరో ఇలాంటి వేషం వెయ్యడం అనేది చాలా పెద్ద విషయం అని చెప్పాలి. కాగా అల్లు అర్జున్ వేసిన ఈ గెటప్ పైనే రష్మిక రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ చర్చకు దారి తీశాయి. అల్లు అర్జున్‌లా ఆ రోల్ అండ్ గెటప్ వేయాలి అంటే వేరే ఎవరికీ అయినా ఎంతో గట్స్ ఉండాలి అని చేసిన కామెంట్స్ ఇపుడు రష్మికపై ట్రోల్స్ పడేలా చేసాయి.
రష్మిక అల్లు అర్జున్ ని ఎలివేట్ చేసేలా ఉన్న ఆ కామెంట్స్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఒక హీరో లేడీ వేషం వేయడం ఇదేమి కొత్త కాదు అని తనకంటే ముందే చాలా మంది స్టార్స్, కేవలం కొన్ని సీన్స్ లోనే కాదు టోటల్ సినిమాలో కూడా లేడీ గెటప్ వేశారని కౌంటర్ ఇస్తున్నారు. భామనే సత్య భామనే లో కమల్ హాసన్, కాంచన లో రాఘవ లారెన్స్ ఇంకా వెర్సటైల్ నటుడు విజయ్ సేతుపతిలు ఫుల్ లెంగ్త్ లేడీ రోల్ చేసారు అని రష్మికపై విమర్శలు వచ్చి పడుతున్నాయి.

అయితే పుష్ప 2 రిలీజ్ అయ్యాక అల్లు అర్జున్ జాతర పెర్ఫామెన్స్ చూసి చాలా మంది తనకి పక్కాగా నేషనల్ అవార్డు వస్తుంది అని టాక్ వచ్చింది. అయితే దానికి మించిన పెర్ఫామెన్స్ రాఘవ లారెన్స్ కూడా ఇచ్చాడు అంటూ కొందరు బన్నీ పెర్ఫామెన్స్ ని తగ్గించే ప్రయత్నం చేశారు. తాజాగా ఇపుడు రష్మిక కామెంట్స్ పైనా మండిపడుతున్నారు. దీంతో మరోసారి రష్మికపై ట్రోల్స్ తప్పడం లేదు. ఇక ఈ బిగ్గెస్ట్ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో సాలిడ్ వసూళ్లతో దూసుకెళ్తుంది. ఫైనల్ రన్‌లో పుష్ప 2 ఎక్కడ ఆగుతుందో అని చాలా మంది ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











