100 కోట్ల రెమ్యునరేషన్.. యువ హీరోపై నెటిజన్ల ట్రోల్స్
మారుతున్న ట్రెండ్ తో కాలంతో పాటుగా కొత్త రక్తం సినీ పరిశ్రమలోకి వస్తూనే ఉంటుంది. అలా ఇప్పుడిపుడే తెలుగు సినిమా దగ్గర యువ దర్శకులు అలాగే హీరోలు కూడా సాలిడ్ కంటెంట్ ని తీసుకొచ్చి హిట్స్ కొడుతున్నారు. అయితే ఈ క్రమంలో కొందరు కాన్ఫిడెంట్ గా ఉంటే ఇంకొందరు కావాలని చేస్తారో లేక ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలో తెలీదు కానీ ఆ కొందరు మాత్రం ఆడియెన్స్ దగ్గర తమ అతి మూలానే వార్తల్లోకి ఎక్కుతారు.
అయితే ఇపుడు మన తెలుగు సినిమా దగ్గర ఉన్న యువ హీరోస్ లో అందరూ కాదు కానీ కేవలం ఓ కొందరు మాత్రం తమ మాటలు చేష్టలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతారు. ముఖ్యంగా ఇలాంటివి సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ అలాగే మరో యువ హీరో విశ్వక్ సేన్ లు విషయంలో కనిపిస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో కూడా చాలా మంది వీరి ఫ్యాన్స్ విడిపోయి కొట్టుకున్న సందర్భాలు కూడా లేకపోలేవు.

అయితే ఇద్దరి యాటిట్యూడ్ ఒకింత దగ్గర దగ్గరగానే ఉంటుంది. అందుకే వీరి విషయంలో మాత్రం చాలా కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. తమ సినిమాల పరంగానో తమ వ్యక్తిగతంగానో చేసే పలు కామెంట్స్ ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లోకి వస్తుంటాయి. మరి ఇలా లేటెస్ట్ గా విశ్వక్ సేన్ చేసిన స్టేట్మెంట్ ఇపుడు వైరల్ గా మారింది.
కాగా ఏ హీరోకి అయినా కూడా మార్కెట్ పెంచుకోవాలి అని ఖచ్చితంగా ఉంటుంది అందులో ఎలాంటి తప్పు లేదు కానీ ఈ క్రమంలో మన ప్రవర్తన, మాట, తీరు ఇవన్నీ కూడా పరిగణలోకి వస్తాయి. మరి అవేవి లేకుండా ఓ సినిమా 100 కోట్ల వసూళ్లు అందుకోవడం పెద్ద వింతేమీ కాదు కానీ అవన్నీ పెట్టుకొని ఓ హీరో 100 కోట్ల రెమ్యునరేషన్ అందుకునే స్థాయిలోకి వెళ్లడం అనేది ఏమాత్రం చిన్న విషయం కాదు.
సరిగా ఇపుడు ఇదే విశ్వక్ సేన్ అంటున్నాడు. తన సినిమా 100 కోట్ల వసూళ్లు ఎపుడు కొడుతోంది అని ఫ్యాన్స్ అంటారు కానీ 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే రేంజ్ కి వెళ్లాలని విష్ చెయ్యండి అంటూ కామెంట్స్ చేసాడు. దీనితో ఇది కొంచెం ఓవర్ గా లేదా అంటూ పలు కామెంట్స్ ఈ యువ హీరోపై మొదలయ్యాయి.

ఎన్నో ఏళ్ళు నుంచి ఉన్న పలువురు స్టార్ హీరోస్ సైతం 100 కోట్ల రెమ్యునరేషన్ ని అందుకే పరిస్థితి చాలా తక్కువ ఉంది. అలాంటిది ఈ యువ హీరో నుంచి ఈ కామెంట్స్ విన్న న్యూట్రల్ ఆడియెన్స్ కూడా ఒకింత షాకయ్యారు. తన సినిమాలకి మార్కెట్ కి ఇప్పుడు నుంచే ఈ కామెంట్స్ అతిగా ఉన్నాయి అంటూ వినిపిస్తున్నాయి. దీనితో విశ్వక్ ఇలా మళ్ళీ ట్రోల్స్ కి గురి కావాల్సి వచ్చింది.
మరి తాను ఆ స్థాయికి వెళితే తెలుగు హీరోగా సంతోషమే కానీ ఎప్పుడు ఎలా నడుచుకోవాలో సినీ పరిశ్రమలో క్రమశిక్షణ కూడా చాలా అవసరం అని దిగ్గజ నటులే అంటారు మరి చూడాలి విశ్వక్ ఆ రేంజ్ కి వేళ్తాడో చూడాలి. కాగా ఇప్పుడు తన "మెకానిక్ రాకీ" సినిమాతో రాబోతున్నాడు.


Click it and Unblock the Notifications











