'సరిలేరు నీకెవ్వరు'పై పుకార్లు.. ఇదీ అసలు నిజం! మహేష్ బాబు ఫైనల్ డిసీజన్
మహర్షి లాంటి భారీ సక్సెస్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాబోతున్న కొత్త సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గత కొంతకాలంగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పుడు చివరిదశకు రావడంతో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల గురించి రకరకాల రూమర్స్ బయటకు వస్తున్నాయి.

రంగంలోకి వంశీ పైడిపెల్లి.. హెల్ప్
'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్ డిసెంబర్ మొదటి వారంలో ఫినిష్ కానుంది. ఈ నేపథ్యంలో షూటింగ్ పూర్తికాగానే వంశీ పైడిపెల్లి రంగంలోకి దిగనున్నారని, సినిమాకు తుది మెరుగులు దిద్దే పని ఆయనే చేయనున్నారని టాక్ నడిచింది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి మరో అప్‌డేట్ బయటకొచ్చింది.

అనుకున్నట్లుగా ఫైనల్ ఎడిట్‌లో
అందరూ అనుకున్నట్లుగా ఫైనల్ ఎడిట్‌లో వంశీ పైడిపెల్లి ఉండరనేది తాజా సమాచారం. సినిమాకు సంబంధించి పూర్తి బాధ్యతను కేవలం అనిల్ రావిపూడికే అప్పగించారట మహేష్. వంశీ పైడిపెల్లి నుంచి కేవలం సలహాలు, సూచనలు మాత్రమే తీసుకోనున్నారట మహేష్. దీంతో ఇప్పటిదాకా వచ్చిన రూమర్స్‌కి ఫుల్ స్టాప్ పడినట్లయింది.

మహేష్ బాబు భాగం.. హ్యాట్రిక్ కోసం తపన
ఇక ఈ సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకుని హ్యాట్రిక్ విజయాలను అందుకోవాలని కసిగా పని చేస్తున్నారు మహేష్ బాబు. జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు ఎంతో భారీగా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరు నిర్మాణంలో మహేష్ కూడా భాగం కావడం విశేషం.

విజయశాంతి రీ ఎంట్రీ.. అభిమానుల్లో ఆతృత
ఈ సినిమాతోనే లేడీ అమితాబ్ విజయశాంతి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. దేవి శ్రీ బాణీలు కడుతున్న ఈ సినిమా జనవరి 12న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రంలో మహేష్ సరసన క్రేజీ భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











