twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బి.సరోజాదేవికి.. టీఎస్ఆర్ 'విశ్వనటసామ్రాజ్ఞి' సత్కారం

    |

    సుప్రసిద్ధ నటీమణి బి.సరోజాదేవి‌ని టిఎస్ఆర్ లలితకళాపరిషత్ 'విశ్వనట సామ్రాజ్ఞి' బిరుదు‌తో సత్కరించనుంది. మార్చి 4న మహాశివరాత్రి సందర్భంగా విశాఖలో టి.సుబ్బరామిరెడ్డి నిర్వహించే వేడుకలో ఆమెను సత్కరించనున్నారు.

    మహాశివుడి భక్తుడైన సుబ్బిరామిరెడ్డి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా విశాఖలో భారీ వేడుక నిర్వహిస్తూ ఉంటారు. పాతికేళ్ళుగా ఆయన ఈ సంప్రదాయం కొనసాగిస్తున్నారు. టీఎస్సార్ నిర్వహించే మహాశివరాత్రి లింగార్చనకు దేశవిదేశాలవాసులు సైతం హాజరవుతూ ఉంటారు. విశాఖ రామకృష్ణా బీచ్ ఇందుకు వేదిక కాబోతోంది. లక్షలాదిగా తరలివచ్చే ప్రజలచేతనే కోటి శివలింగాల ప్రతిష్ఠాపన, మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు.

    ఈ కార్యక్రమం టీఎస్సార్ కళాపీఠం ఆధ్వర్యంలో సాగుతుంది. ఈ సందర్భంగా ప్రతి మహాశివరాత్రి నాడు కళాకారులను సన్మానించడం విధిగా నిర్వర్తిస్తున్నారు. ఈ యేడాది మహాశివరాత్రి సందర్భంగా పద్మభూషణ్ అవార్డు గ్రహీత బి.సరోజాదేవికి "విశ్వనటసామ్రాజ్ఙి " బిరుదుతో సత్కరించనున్నారు.

     TSR Viswanata Samragni honour to B.Saroja Devi

    ఈ సన్మాన కార్యక్రమంలో ప్రముఖ నటీనటులు జమున, వాణిశ్రీ, గీతాంజలి, సుమన్, మీనా, మధురగాయని పిసుశీల వీరితో పాటు పలువురు సినీరాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు. సాలూరి వాసూరావు సంగీతావిభావరి నిర్వహించనున్నారు.

    బి.సరోజాదేవి కన్నడ నాట జన్మించినా, తెలుగువారికి సుపరిచితులు. ఎన్టీ రామారావు 'పాండురంగ మహాత్మ్యం' ద్వారా ఆమెను తెలుగుతెరకు పరిచయం చేశారు. ఆ తరువాత "సీతారామకళ్యాణం, జగదేకవీరుని కథ, దాగుడుమూతలు, ఇంటికి దీపం ఇల్లాలే, మంచి-చెడు, మాయని మమత, భాగ్యచక్రము, ఉమాచండీ గౌరీశంకరుల కథ, విజయం మనదే, మనుషుల్లో దేవుడు, దానవీరశూర కర్ణ" వంటి చిత్రాల్లో నటించారు. అక్కినేనితో "పెళ్ళికానుక, ఆత్మబలం, అమరశిల్పి జక్కన్న, వసంతసేన, రహస్యం" వంటి చిత్రాల్లో నటించారు.

    English summary
    Yester years lovable heroine and great actress B.Saroja Devi is going to get another jewel in her crown, this time noted Politician and film producer 'Kalabandhu' Dr.T.Subbarami Reddy honours her with 'Viswanata Samragni' on March 4th, on the occasion of Mahasiva Ratri.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X