For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సినిమా రిలీజ్ విషయంలో నాని బిగ్ సర్‌ప్రైజ్.. ఆమెజాన్ వాళ్ళతో మాట్లాడా అంటూ కీలక ప్రకటన!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలు ఎంట్రీ ఇస్తున్నా కొందరు బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్లుగా నిలదొక్కుకుంటున్నారు. అలాంటి వారిలో నేచురల్ స్టార్ నాని ఒకరు. సినిమాల్లో క్లాప్ బాయ్ గా ఎంట్రీ ఇచ్చిన నని తన సహజ సిద్ధమైన నటనతో ప్రతి సినిమాతో హిట్స్ కొడుతూ స్టార్ గా నిలబడ్డాడు. 'జెర్సీ' హిట్ తర్వాత అంత పెద్ద హిట్ కోసం చాలా కాలంగా వేచి చూస్తున్నారు.

  వీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ఇప్పుడు 'టక్ జగదీష్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన డానికి ప్రకారం ఈ రోజు అర్ధరాత్రి నుంచి స్ట్రీమ్ కావాల్సి ఉంది. అయితే ప్రేక్షకుల కోసం కీలక విషయం ఒకటి వెల్లడయింది. ఆ వివరాల్లోకి వెళితే

  షర్ట్ బటన్స్ తీసేసి షాకిచ్చిన ధన్య బాలకృష్ణ: హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయిన సుధీర్ లవర్

  నాని బిగ్ సర్‌ప్రైజ్

  నాని బిగ్ సర్‌ప్రైజ్

  ఈ మధ్య కాలంలో హీరో నాని సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్నారు, ఎలా అయినా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో 'టక్ జగదీష్' అనే మూవీ చేశారు. రేపు వినాయక చవితి సందర్భంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో నాని బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. నాని హీరోగా శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రమే ‘టక్ జగదీష్'. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఇందులో టాలెంటెడ్ హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని షైస్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, పెద్ది హరీష్ నిర్మిస్తున్నారు.

  Shriya Saran ముంబై వీధుల్లో మొగుడితో శ్రీయాసరన్ ముద్దులాట.. నడిరోడ్డుపైనే రొమాంటిక్‌గా

  అంచనాలు రెట్టింపు

  అంచనాలు రెట్టింపు

  నాజర్, జగపతిబాబు, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా పూర్తిగా ఫామిలీ ఎంటర్ టైనర్ గా ఉండబోతోంది. ఈ సినిమా నుంచి టీజర్, పోస్టర్లలో ఏకంగా కత్తి పట్టుకుని కనిపించిన నాని అభిమానులతో పాటు ప్రేక్షకులలో కూడా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడేలా చేసింది. ఇక గతంలో నానితో ‘నిన్ను కోరి' వంటి సూపర్ హిట్ తీసిన శివ నిర్వాణ ఇప్పుడు ‘టక్ జగదీష్' అనే సినిమాను తెరకెక్కించడంతో ఈ సినిమా మీద అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.

  Shilpa Shetty గణపతి మహరాజును ఇంటికి ఆహ్వానించిన శిల్పాశెట్టి..

  అలా వాయిదా

  అలా వాయిదా

  నిజానికి ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోన తదితర కారణాలతో ప్రేక్షకుల ముందుకు మాత్రం రాలేదు. ఇక మొన్న సమ్మర్‌ లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించినా.. కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా అది సాధ్య పడలేదు. చివరిగా ఈ సినిమా సెప్టెంబర్ 10 నుంచి అమెజాన్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే వెల్లడించింది. ‘టక్ జగదీష్' మూవీ స్ట్రీమింగ్ వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10 కానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది, అయితే తాజా సమాచారం ప్రకారం.. దీన్ని ఒక రోజు ముందుగానే అంటే ఈ రోజే విడుదల చేయబోతున్నారు.

  Naina Ganguly : ఘాటు అందాలతో రచ్చ.. ఎద అందాలు ఒకపక్క, గీత దాటేసి మరీ ఇలానా!

  ముందే

  ముందే

  రాత్రి 10 గంటల నుంచే నాని సినిమా అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానుందని ముందు ప్రచారం జరిగినా ఇప్పుడు మారిత ముందే సినిమా రిలీజ్ కాబోతోందని అంటున్నారు. ఇక టక్ జగదీష్ కోసం ఆమెజాన్ తన వ్యూహాన్ని మార్చుకుంది. ఈ సినిమా ప్రీమియర్ ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుందని అంటున్నారు, ప్రమోషన్స్ లో మాట్లాడుతూ నాని స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.

  Sonal Chauhan అందాల ఆరబోత.. ఉల్లి పొర లాంటి డ్రెస్ లో అంతా కనిపించేలా హాట్ షో !

  Actor Nani Biography వివాదాలను హుందా గా ఎదుర్కున్న స్టార్!! || Filmibeat Telugu
  సినిమా చూసి లేవండి

  సినిమా చూసి లేవండి

  "వారు 10 ఇంటికే విడుదల చేయడం కోసం ప్లాన్ చేశారు. కానీ నేను దాన్ని ముందు చేయమని అమెజాన్ వాళ్ళకు చెప్పాను, టక్ జగదీష్ రాత్రి 8 గంటల నుంచి 8.30 గంటల మధ్య అంటే అనుకున్న దానికంటే ముందే వస్తుందని పేర్కొన్నాడు. ఇక రేపు ఉదయం వినాయక చవితి పూజ కోసం మా సినిమా చూసి పొద్దున్నే లేవవచ్చు అని నాని చెప్పాడు. తమ అభిమాన హీరోను చూడటానికి చాలా ఉత్సాహంగా ఉన్న నాని అభిమానులకు ఇది నిజంగా ఒక ఆనందం కలిగించే వార్త.

  English summary
  Tuck Jagadish will have an early premiere going live at around 8 PM today. Nani himself revealed this in a media chit-chat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X