Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'టక్ జగదీష్' మరో బిగ్ ఈవెంట్.. ట్రైలర్ వచ్చేది ఆ రోజే!
నేచురల్ స్టార్ నాని చాలా రోజుల తరువాత డిఫరెంట్ స్టైల్ లో ప్రమోషన్ డోస్ పెంచుతున్నాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా మినిమమ్ గ్యారెంటీ అనేలా సినిమాలు చేసే ఈ యువ హీరో నెక్స్ట్ టక్ జగదీష్ తో బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని రెడీ అవుతున్నాడు. చివరగా చేసిన V సినిమా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ టాక్ ను అందుకోలేదు. అందుకే టక్ జగదీష్ తో ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు.
నిన్నుకొరి లాంటి బాక్సాఫీస్ హిట్ అనంతరం శివ నిర్వణ, నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇటీవల పరిచయ వేడుకతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసిన నాని టీమ్ మరో ఈవెంట్ ను కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ట్రైలర్ ను లాంచ్ చేయడానికి ప్రత్యేకంగా వైజాగ్ లో ఈవెంట్ ను నిర్వహించనున్నారట.
ఏప్రిల్ 13న ఆ వేడుక జరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈవెంట్స్ తోనే సినిమాపై భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పటికే సినిమా టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ తో మరింత బజ్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఇక సినిమాను ఏప్రిల్ 23న రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ లో నిర్మించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అంధించాడు. రీతూ వర్మ ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించగా జగపతిబాబు ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.