For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Tuck Jagadish Trailer: అయినోళ్ళ కంటే ఆస్తులు పొలాలు ఎక్కువ కాదు.. నాని ఫ్యామిలీ పిచ్చి!

  |

  నేచురల్ స్టార్ నాని శివ నిర్వాణ కాంబినేషన్ లో వస్తున్న రెండవ సినిమా టక్ జగదీష్ సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అసలైతే థియేటర్స్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా పరిస్థితుల కారణంగా డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతోంది. గతంలో నాని వి సినిమా కూడా ఇదే తరహాలో విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ టక్ జగదీష్ సినిమాతో మాత్రం నాని ఎలాగైనా పాజిటివ్ టాక్ ను అందుకోవాలని చూస్తున్నాడు.

  ఇక ఈ సినిమాకు సంబంధించిన మొదటి ట్రైలర్ ను విడుదల చేశారు. టైలర్ తోనే సినిమా ఎమోషనల్ అండ్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ట్లు తెలుస్తోంది. నాని మరోసారి తన మార్క్ యాక్టింగ్ తో మెప్పించే అవకాశం ఉన్నట్లు కూడా అర్ధమవుతోంది.

  స్వార్థంగా కనిపించనున్న నాని..

  స్వార్థంగా కనిపించనున్న నాని..

  టైలర్ విషయానికి వస్తే.. భూదేవిపురం గురించి కథ చెప్పాలి అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. గ్రామంలో ఉండే భూకబ్జాలు గొడవలు అనే ఒక మేజర్ పాయింట్ తో సినిమా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందులోనే ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు హీరో సెల్ఫిష్ క్యారెక్టర్ ను కూడా హైలెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. టక్ జగదీష్ క్యారెక్టర్ కూడా స్వార్థంతో ఉండబోతున్నట్లు క్లారిటీగా చెప్పేశారు. విలన్ కు ధీటుగా నిలబడేందుకు జగపతిబాబు మరోవైపు ప్రయత్నాలు చేస్తుండగా అతడి సోదరుడు నాని విలన్స్ తో చితక్కొట్టే సన్నివేశాలు దర్శనమిస్తున్నాయి.

  నాని డిఫరెంట్ స్టైల్

  నాని డిఫరెంట్ స్టైల్

  నాని ఈ సినిమాలో ఒక డిఫరెంట్ ట్రెండీ లుక్ తో కనిపించబోతున్నాడు. కూల్ గా బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని మొదటి ఫైట్ లోనే అభిమానులకు బాగా ఎట్రాక్ట్ చేశాడు.. అమ్మానాన్న, అన్నయ్య, సిస్టర్ సెంటిమెంట్ కూడా సినిమాలో బాగానే ఉన్నట్లు అర్థమవుతోంది. నాని చేత ఆమె తల్లి గరగ కట్టిస్తానని మొక్కుకున్న కొన్ని సన్నివేశాలు కూడా మంచి ఫ్యామిలీ వాతావరణాన్ని హైలెట్ చేసేలా ఉన్నాయి. ఇక మరో వైపు హీరోయిన్ రీతు వర్మ సినిమాలో VRO వరలక్ష్మిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది

  ఆస్తులు పొలాలు ఎక్కువ కాదు

  ఇక జగపతి బాబు నాని డైలాగ్స్ కూడా ఈ సినిమాలో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నాయి. అయినోళ్ళ కంటే ఆస్తులు పొలాలు ఎక్కువ కాదు. రక్త సంబంధం విలువ ఏమిటో తెలుసుకో.. అంటూ జగపతి బాబు చెప్పిన డైలాగ్ ఆలోచింపజేస్తుంది. నీకు ఏమి తెలియదు.. చిన్న పిల్లడివి అని అనగానే నాని విలన్స్ ను కొట్టే సీన్స్ రెగ్యులర్ స్టైల్ లోనే ఉన్నప్పటికీ బాడీ లాంగ్వేజ్ లో మాత్రం నేచురల్ స్టార్ సరికొత్తగా దర్శనమిస్తున్నారు. కక్షలు లేని భూదేవిపురాన్ని చూడాలనే కోరిక ఇప్పుడు అది నా బాధ్యత.. అంటూ నాని పొలంలో విలన్స్ తో భారీ ఫైట్ చేస్తాడట.

  జగపతిబాబు vs నాని

  జగపతిబాబు vs నాని

  సినిమాలో పొలంలో జరిగే ఒక భారీ ఫైట్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుందట. ఆ విజువల్స్ కూడా ట్రైలర్లో హైలెట్ అయ్యాయి. చిన్నప్పుడు ఒక మాట చెప్పావు గుర్తుందా? కుటుంబం ఓడిపోతే నేను ఓడిపోయినట్టే అంటూ జగపతిబాబుతో దీటుగా చెప్పిన డైలాగ్ ఫ్యామిలీ డ్రామాను తలపిస్తోంది. చూస్తుంటే జగపతి బాబు నాని పోటాపోటీగా సినిమాలో తలపడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మదర్ సెంటిమెంట్ కూడా సినిమాలో ఎక్కువగానే ఉన్నట్లు అనిపిస్తుంది.

  ఫ్యామిలీ పిచ్చి

  ఫ్యామిలీ పిచ్చి

  ప్రాక్టికల్ గా ఆలోచించే హీరో మొదట ఫ్యామిలీ ఎమోషన్స్ పట్టించుకోకుండానుంటాడు. ఆ తర్వాత మళ్లీ ఆ కుటుంబంకు ఎలా కనెక్ట్ అయ్యాడు అనే అంశాన్ని హైలెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. డబ్బు పిచ్చి కుల పిచ్చి ఉన్న వాళ్ళను చూస్తారు కదా ఈయనకేమో కుటుంబం పిచ్చి అంటూ.. ప్రవీణ్ చెప్పే డైలాగ్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇక చివర్లో బాబాయ్ నువ్వు మా ఫ్యామిలీ కాదా..? అని ఒక చిన్న పాప అడగడంతో నాని కళ్ళ జోడు పెట్టుకుని తెలియట్లేదు అంటూ చాలా ఎమోషనల్ గా టచ్ చేశాడు. మరి ట్రైలర్ తోనే అన్ని రకాల ఎమోషన్స్ ను టచ్ చేసిన టక్ జగదీష్ ఫుల్ సినిమాతో య్ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

  English summary
  Tuck Jagadish Trailer: Nani And Shiva Nirvana Movie's Emotional Trailer Is Out On Amazon Prime
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X