Tuckk Jagadish audience review: దారుణమైన ట్రోల్స్.. మరీ ఆ రేంజ్ లో ఉందా?
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'టక్ జగదీష్' సినిమా అనుకున్నట్టుగానే ఒకరోజు ముందే విడుదలయింది. ఈరోజు సరిగ్గా ఎనిమిది గంటలకు ఈ సినిమా ప్రేక్షకుల కోసం అందుబాటులోకి వచ్చేసింది. అయితే ఈ సినిమా చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులు ఎలా స్పందిస్తున్నారు అనేది చూస్తే

ముందే వచ్చేసి
ముందు నుంచి ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అనుకున్నారు. నాని సహా దర్శక నిర్మాతలు కూడా సినిమాను అలాగే థియేటర్లో రిలీజ్ చేయాలనీ అనుకున్నారు కానీ ఈ చివరికి సినిమాని ఆమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయాలనీ అనుకున్నాఒకరోజు ముందే స్పెషల్ ప్రీమియర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు.

రొటీన్ ఫామిలీ డ్రామా
భూదేవి పురం, భూమి తగాదాలు అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా నాజర్ లాంటి వాయిస్ తో మొదలవుతుంది, అరేయ్ జగదీ.. మగవాడు ఏడవకూడదు.. అమ్మాయిలను ఏడిపించకూడదు అని మొదలైన ఈ సినిమా మొత్తంగా ఒక ఫ్యామిలీ డ్రామా. మేనకోడలు అయిన చంద్రమ్మ(ఐశ్వర్య రాజేష్) కోసం టక్ జగదీష్ ఎంత దూరం వెళ్తాడన్నదే సినిమా కథ.

రాడ్ సినిమా అంటూ
అయితే ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఏమాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపించడం లేదు. ఈ సినిమా ఏ మాత్రం బాలేదు అనే టాక్ వినిపిస్తోంది.. నాని సినిమా కెరీర్లోనే ఈ సినిమా భారీ డిజాస్టర్ అని కొంతమంది అంటే సినిమా చూస్తుంటే అసలు ఏ మాత్రం నచ్చే దాఖలాలు లేవని కొందరు అంటున్నారు. మరికొందరైతే థియేటర్లలో సినిమా రిలీజ్ చేస్తే దారుణమైన కలెక్షన్లు చూడాల్సి వస్తుందని ఉద్దేశంతోనే మేకర్స్ ముందు జాగ్రత్త పడ్డారు అని అంటున్నారు.

ముందు జాగ్రత్తతో
ముందు జాగ్రత్తతోనే అమెజాన్ ప్రైమ్ సంస్థకు ఈ సినిమాను వేసుకున్నారని విమర్శిస్తున్నారు. కొంతమంది సినిమా రాడ్ అంటూ విమర్శిస్తుంటే కొంత మంది మాత్రం టక్ లూజ్ అయింది అని అంటున్నారు. మొత్తంగా చూస్తే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న పరిస్థితులు కనిపించడం లేదు. అయితే అమెజాన్ ప్రైమ్ సంస్థకు అమ్మేయడంతో నిర్మాతలు కొంత సేఫ్ అయినట్లే.

ఆ టెన్షన్ లేనట్టే
ఆమెజాన్ కు ఇచ్చేశారు కాబట్టి ఈ కలెక్షన్లు టెన్షన్ అనేది ఉండదు. అయితే ఈ సినిమా థియేటర్లలో మాత్రమే రిలీజ్ చేయాలని ముందు నుంచి కూడా నాని సహా మిగతా యూనిట్ సభ్యులు కూడా భావించారు. కానీ నిర్మాతల ఫైనాన్షియల్ టెన్షన్స్ కారణంగా సినిమా థియేటర్ లో రిలీజ్ చేయకుండా డిజిటల్ వేదిక రిలీజ్ చేశారు. మరి సినిమా పూర్తి రివ్యూ వస్తే మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.
Recommended Video

మొదటి సినిమా హిట్ కావడంతో
షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించిన సినిమా టక్ జగదీశ్. 'నిన్నుకోరి' వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందింది. నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించారు.


Click it and Unblock the Notifications











