For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

న్యూడ్ యోగాతో షాకిచ్చిన టీవీ నటి.. ఆమె కోసమే చేశానంటూ.. ఫొటోలు చూస్తే ఆశ్చర్యపోతారు

|

యోగా.. వ్యక్తిని మానసికంగా, శారీరకంగా ఎంతో బలంగా చేసే ప్రక్రియ. అందుకే దీనిని చేయమని ఎంతో మంది చెబుతూ ఉంటారు. ఇక, మనదేశంలోనైతే యోగా కోసం ప్రత్యేకంగా ఓ రోజును ప్రకటించారు. వాస్తవానికి పూర్వ కాలం నుంచే యోగా మనదేశంలో ఉంది. దాన్ని ఇప్పటి తరం వాళ్లు మర్చిపోకుండా కేంద్ర ప్రభుత్వం యోగా డేను తీసుకు వచ్చింది.

సెలెబ్రిటీలు యోగా చేస్తూ..

సెలెబ్రిటీలు యోగా చేస్తూ..

యోగా అనేది ప్రస్తుత పరిస్థితుల్లో బాగా పాపులర్ అయిపోయింది. ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఇప్పుడు ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. యోగా గురించి తెలిసిన సెలెబ్రిటీలు కూడా తరచూ యోగా చేస్తూ ఫొటోలను సోషల్ మీడియాలో ఉంచడం పరిపాటి అయిపోయింది. ఇందులో ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్లు చేస్తుంటారు.

అబిగైల్ టాప్‌లెస్ యోగా

తాజాగా ప్రముఖ టీవీ నటి, డ్యాన్సర్ అబిగైల్ పాండే టాప్‌లెస్ యోగాను భారతదేశానికి పరిచయం చేశారు. ఈ విధమైన యోగాను విదేశాల్లో చాలా మంది చేస్తున్నారు. అయితే, మనదేశంలో మాత్రం ఈ తరహా యోగా చేస్తున్నప్పటికీ, దాన్ని బయట పెట్టేందుకు చాలా మంది ధైర్యం చేయడం లేదు. కానీ, అబిగైల్ మాత్రం దీనికి భిన్నంగా చేసి వార్తల్లోకెక్కింది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫొటోను షేర్ చేసింది. దీంతో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది.

ఆమె కోసమే చేశానంటూ..

ఇన్‌స్టాలో టాప్‌లెస్ యోగాకు సంబంధించిన ఫొటోను షేర్ చేసిన అబిగైల్.. ‘‘న్యూడ్ యోగా గర్ల్ ఏదైతే చేస్తుందో.. దానిని అభినందించడానికి మాటలు చాలడం లేదు. ఆమె తన ఇన్‌స్టా ఖాతాను ఎలా హ్యాండిల్ చేస్తుందో మీ అందరికీ తెలియకపోవచ్చు. కానీ, ఆమె ఏం చెప్పాలనుకుందో అది స్పష్టంగా వివరిస్తోంది. పుస్తక ముఖచిత్రం ద్వారా తీర్పు చెప్పడం అంతిమం కాదని మనకు తెలియదా? యోగాను నగ్నంగా చేయాలని లేకపోవచ్చు. కానీ, ఇది అర్థం చేసుకునే దానిని బట్టి ఉంటుంది'' అని రాసుకొచ్చింది.

మొదట భయపడ్డాను

అబిగైల్ ఈ ఫొటోను ఎందుకు షేర్ చేసిందో స్పష్టం చెప్పింది. అదే సమయంలో దీన్ని షేర్ చేయడానికి చాలా భయపడ్డానని వెల్లడించింది. ‘‘మొదట ఈ టాప్‌లెస్ యోగా ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయాలంటే సిగ్గు పడ్డాను. అదే సమయంలో భయపడ్డాను కూడా. ఒకసారి షేర్ చేసిన తర్వాత ఎంతో రిలీఫ్‌గా అనిపించింది'' అని చెప్పుకొచ్చింది.

 న్యూడ్ గర్ల్ యోగా

న్యూడ్ గర్ల్ యోగా

న్యూడ్ గర్ల్ యోగా అనే పేరిట ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ అధికారిక పేజీ ఉంది. ఇందులో ఉన్న ఫొటోలన్నీ న్యూడ్‌గానే ఉంటాయి. ఈ ఫొటోలు చూస్తే యోగా ఇలా కూడా చేస్తారా..? అని ఆశ్చర్యం కలిగిస్తాయి. అందుకే ఈ న్యూడ్ యోగాకు అబిగైల్ పాండే ఆకర్షితురాలైందని కొందరు చెబుతుంటారు.

అబిగైల్ గురించి

అబిగైల్ గురించి

ఈమె ఎన్నో సీరియల్స్‌లో నటించింది. అయితే, కొద్దిరోజుల క్రితం వచ్చిన నాచ్ బలియే రియాలిటీ షో ఎనిమిదవ సీజన్‌లో పాల్గొని సుపరిచితురాలు అయిపోయింది. ఇదంతా ఒక ఎత్తైతే.. ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. అందులో కూడా యోగా చేస్తూనే కనిపిస్తుంటుంది.

English summary
TV actress and dancer Abigail Pande latest Instagram post is not only inspiring but empowering as well. Abigail, who is a yoga enthusiast, is out on a yoga retreat with BFF Aashka Goradia and her husband Brent Goble.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more