పోర్న్ వీడియోలను షూట్ చేసి దొరికిపోయిన 'ఆపరేషన్ దుర్యోధన' నటి.. కేసు నమోదు
ఒక వెబ్‌సైట్‌లో పోర్న్ వీడియోలను షూట్ చేసి అప్‌లోడ్ చేయడంలో ఆమె పాత్ర ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ నటి, మోడల్ గెహానా వసిష్త్‌ను ముంబై క్రైమ్ బ్రాంచ్ ప్రాపర్టీ సెల్ అరెస్ట్ చేసింది. ఒక్కసారిగా ఈ వార్త నేషనల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలోనే ఒకసారి ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న ఆమె ఇప్పుడు చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంది. గెహానా పలు తెలుగు సినిమాల్లో కూడా నటించింది.

ఆ పిర్యాదు తరువాత..
ఆమెను ఈ రోజు ముంబైలోని కోర్టుకు హజరుపరచనున్నట్లు నేషనల్ మీడియా ANI నివేదించింది. పోర్న్ చిత్రాలలో నటించమని బలవంతం చేశారని ఆరోపిస్తూ ముగ్గురు వ్యక్తులు ఫిర్యాదు చేసిన తరువాత ఈ గుట్టు బయటకు వీడింది. మోడల్‌గా అనేక బ్రాండ్ అడ్వటైజ్ మెంట్స్ లలో నటించడమే కాకుండా, ఆమె మిస్ ఆసియా బికినీగా కిరీటం పొందింది.

80 యాడ్స్ లలో..
మోడల్ గా ఒకపుడు గెహానా ఎంతగానో గుర్తింపు అందుకుంది. ఆమె 80కి పైగా ప్రకటనల్లో నటించింది. కానీ సినిమాల్లో మాత్రం అంతగా క్లిక్కవ్వలేదు. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలలో ఆమె వర్క్ చేసింది. తెలుగులో ఆపరేషన్ దుర్యోధన వంటి సినిమాల్లో ఐటెమ్ సాంగ్ లో నటించి కొన్ని చిన్న చిన్న సినిమాల్లో అవకాశం అందుకుంది.

గందీ బాత్ సీజన్ 3లో..
ఫిల్మీ దునియా అనే హిందీ చిత్రంలో ప్రధాన పాత్ర ద్వారా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది గెహానా అవకాశాల తగ్గడంతో గ్లామర్ డోస్ మరింత పెంచుతూ వచ్చింది. ఆల్ట్ బాలాజీలో గాండి బాత్ సీజన్ 3 తో సహా పలు బోల్డ్ కంటెంట్ వెబ్ సిరీస్‌లలో ఆమె నటించింది. ఇక చాలా రోజుల తరువాత ఆమె పోర్న్ వీడియోలను షూట్ చేసి అప్‌లోడ్ చేయడంలో ఆమె పాత్ర ఉందని తెలియడంతో కేసు నమోదైంది.

87 పోర్న్ వీడియోలను చిత్రీకరించి..
ఒక ముంబై పోలీసు ఉన్నతాధికారి ఒక ప్రముఖ పోర్టల్‌తో మాట్లాడుతూ, ఆమె 87 పోర్న్ వీడియోలను చిత్రీకరించి వాటిని తన వెబ్‌సైట్లలో పోస్ట్ చేసిందని, ఆ వీడియోలను చూడటానికి సబ్‌స్క్రిప్షన్ అవసరం. ఛానెల్‌కు సబ్‌స్క్రిప్షన్ కోసం 2000 ఆన్ లైన్ ద్వారా వసూలు చేస్తున్నట్లు ఆ అధికార మీడియాకు తెలియజేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











