బిగ్ బాస్ హౌస్‌లో ఐదో పార్టిసిపెంట్ టీవీ నటి హిమజ.. మాస్ మసాలా పాటతో!
గత రెండు సీజన్లు సాఫీగా సాగిన బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ మూడో సీజన్ విషయంలో మాత్రం వివాదాల్లో ఇరుక్కుంది. షో ప్రారంభానికి ముందే ఈ షో బ్యాన్ చేయాలంటూ పలు అవాంతరాలు ఎదురయ్యాయి. శ్వేతా రెడ్డి, గాయత్రీ గుప్తా లాంటి వారి ఆరోపణలు, ఓయూ జెఏసి నిరసనలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి బిగ్ బాస్ షో అట్టహాసంగా ప్రారంభమైంది.
100 రోజుల పాటి నిర్విరామంగా జరగనున్న ఈ షోకి హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నాడు. ముందుగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన ఆయన పార్టిసిపెంట్స్ ఒక్కొక్కరినీ బిగ్ బాస్ హౌస్ లోకి ఆహ్వానిస్తున్నారు. మొత్తం 15 మంది కంటిస్టెంట్లు పాల్గొననున్న ఈ రియాలిటీ షోలో ఐదో పార్టిసిపెంట్ గా టీవీ నటి హిమజ అడుగు పెట్టారు. బిగ్ బాస్ హౌస్ లోకి సాదరంగా ఆహ్వానించిన నాగార్జున.. హిమజ గురించి ప్రేక్షకులకు ఇంట్రో ఇచ్చాడు.

టీవీ నటి హిమజ.. టీవీ ఆర్టిస్ట్ గా ఫుల్లుగా ఫేమస్ అయింది. పలు సీరియల్స్ లో నటించి పాపులారిటీ సంపాదించింది. శతమానం భవతి లాంటి సినిమాల్లో నటించి వెండితెరపై కూడా హంగామా చేసింది. బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి అనే మాస్ మసాలా పాటతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది హిమజ. ఆమెను చూసి నాగార్జున ఫుల్ ఖుషీ అయ్యారు. ప్రస్తుతం ఆమె బిగ్ బాస్ హౌస్ లో మిగిలిన నలుగురు పార్టిసిపెంట్స్ తో కలిసి పోయింది.


Click it and Unblock the Notifications











