Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బిగ్ బాస్ హౌస్‌లో ఫోర్త్ పార్టిసిపెంట్ టీవీ 9 జాఫర్ ఎంట్రీ..
గత రెండు సీజన్లు సాఫీగా సాగిన బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ మూడో సీజన్ విషయంలో మాత్రం వివాదాల్లో ఇరుక్కుంది. షో ప్రారంభానికి ముందే ఈ షో బ్యాన్ చేయాలంటూ పలు అవాంతరాలు ఎదురయ్యాయి. శ్వేతా రెడ్డి, గాయత్రీ గుప్తా లాంటి వారి ఆరోపణలు, ఓయూ జెఏసి నిరసనలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి బిగ్ బాస్ షో అట్టహాసంగా ప్రారంభమైంది.
100 రోజుల పాటి నిర్విరామంగా జరగనున్న ఈ షోకి హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నాడు. ముందుగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన ఆయన పార్టిసిపెంట్స్ ఒక్కొక్కరినీ బిగ్ బాస్ హౌస్ లోకి ఆహ్వానిస్తున్నారు. మొత్తం 15 మంది కంటిస్టెంట్లు పాల్గొననున్న ఈ రియాలిటీ షోలో ఫోర్త్ పార్టిసిపెంట్ గా టీవీ 9 జాఫర్ అడుగు పెట్టారు. ఈయనను బిగ్ బాస్ హౌస్ లోకి సాదరంగా ఆహ్వానించిన నాగార్జున.. టీవీ 9 జాఫర్ గురించి ప్రేక్షకులకు ఇంట్రో ఇచ్చాడు.
టీవీ 9 జాఫర్.. మీడియాలో కేరాఫ్ కాంట్రవర్సీగా పేరు తెచ్చుకున్నాడు జాఫర్. న్యూస్ యాంకర్ గా పలు ఇంటర్య్వూలు చేస్తూ తనదైన శైలిలో సెలబ్రిటీలను తికమక పెట్టడం ఆయన ప్రత్యేకత. ఎన్నో సార్లు లైవ్ లోనే వివాదాల్లో చిక్కుకొని ఫేమస్ అయిన ఈయన.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. చూడాలి మరి బిగ్ బాస్ లో ఆయన వ్యవహారం ఎలా ఉంటుందనేది!.