విడాకులపై టీవీకే విజయ్ అనూహ్య నిర్ణయం.. సంగీతతో అలాంటి డీల్? భార్యకు ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ సూపర్‌స్టార్, టీవీకే అధినేత దళపతి విజయ్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. అభ్యర్ధుల జాబితాను ప్రకటించిన ఆయన.. రాష్ట్రవ్యాప్తంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అయితే వ్యక్తిగత విషయాలు దళపతిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. నటి త్రిషతో రిలేషన్ అంటూ పుకార్లకు తోడు.. తన భార్య సంగీతతో విడాకుల కేసుతో టీవీకే చీఫ్ ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సంగీతతో విడాకుల అంశాన్ని ఎన్నికల లోగా సెటిల్ చేసుకోవాలని ఆయన భావిస్తున్నారు.
తన 30 ఏళ్ల సినీ జీవితానికి రిటైర్‌మెంట్ ప్రకటించి ప్రజల కోసం రాజకీయాల్లోకి దిగారు దళపతి విజయ్. తమిళ వెట్రి కళగం (టీవీకే) పేరుతో ఎన్నికల బరిలో నిలిచారు. ద్రవిడ రాజకీయ దిగ్గజాలు డీఎంకే, అన్నాడీఎంకేలను ఎదుర్కోవడం అంత ఆషామాషీ కాదని తెలిసినప్పటికీ తనకున్న కోట్లాది మంది అభిమాన గణం, ఛరిష్మాతో తమిళనాడులో మార్పును తీసుకొస్తానని చెబుతున్నారు విజయ్. అయితే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వెంటనే ఆయన వ్యక్తిగత జీవితం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

సంగీత విడాకుల నోటీసు
విజయ్ భార్య సంగీత తన భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విడాకుల కారణాలలో తన భర్తకు ఓ నటితో వివాహేతర సంబంధాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అలాగే తనకు విజయ్ ఇంట్లో ఉండే హక్కు కూడా లేదంటూ ఆమె ఆరోపించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన చెంగల్పట్టు కోర్టు.. ఏప్రిల్ 20వ తేదీన విచారణకు హాజరు కావాల్సిందిగా విజయ్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే తాను ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నందున.. ఆన్‌లైన్ ద్వారా విచారణకు హాజరవుతానని విజయ్ తన తరపు న్యాయవాదితో కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది.
సంగీతతో సెటిల్‌మెంట్‌కు విజయ్ ఓకే?
ఇదిలాఉండగా.. ఎన్నికలకు ముందు సంగీతతో వివాదం మంచిది కాదని విజయ్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెతో పరస్పర అంగీకారంతో విడిపోవాలని యోచిస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం చెన్నైలో ఇరువర్గాల న్యాయవాదులు కలిసి చర్చలు జరిపారు. అయితే విజయ్ నుంచి విడిపోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని, విడాకుల సెటిల్‌మెంట్ కింద 250 కోట్లు ఇవ్వాలని సంగీత డిమాండ్ చేస్తున్నట్లుగా తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తనతో పాటు కుమారుడు, కుమార్తెకు కూడా సెటిల్ చేయాలని సంగీత డిమాండ్ చేస్తున్నారట.
సంగీతకు ఎన్ని కోట్లంటే?
అయితే విజయ్ మాత్రం సంగీత డిమాండ్లకు ఒప్పుకోలేదని కోలీవుడ్ టాక్. సెటిల్‌మెంట్ కింద 35 కోట్ల రూపాయలు ఇచ్చి.. కుమారుడు, కుమార్తెల బాధ్యతను తాను తీసుకుంటానని ముందుకు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. సోమవారం చెంగల్పట్లు కోర్టులో విజయ్- సంగీతల విడాకుల కేసు విచారణ జరగనుంది. న్యాయస్థానం ఆదేశాల తర్వాతే ఈ కేసు ముందుకు నడిచే అవకాశం ఉంది. మరి సంగీత ఎలాంటి డిమాండ్లు లేవనెత్తుతారో? విజయ్ ఎలా సెటిల్ చేసుకుంటారనేది తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఈ కేసును అడ్డుపెట్టుకుని ప్రత్యర్ధులు విజయ్‌పై విమర్శలు సంధించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications


