TVK Vijay: విజయ్‌కు లైన్‌క్లియర్.. సీఎంగా దళపతి ప్రమాణ స్వీకారం రేపే..

ఈసారి తమిళనాడు ఎన్నికలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆసక్తికిన కలిగించాయి. ద్రవిడ రాజకీయ దిగ్గజాలు డీఎంకే, అన్నాడీఎంకేలను మట్టికరిపించి తమిళ సూపర్‌స్టార్, దళపతి విజయ్ ఆధ్వర్యంలోని తమిళగ వెట్రి కజగం ఎన్నికల్లో చరిత్ర సృష్టించింది. స్టాలిన్, పళనిస్వామి వంటి హేమాహేమీల వ్యూహాలను చిత్తు చేస్తూ.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే అధికారానికి మరో 11 సీట్లు కావాల్సిన దశలో హైడ్రామా నెలకొంది. అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ గవర్నర్ .. విజయ్‌ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడం తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈరోజుతో తమిళనాడు హైడ్రామాకు చెక్ పడింది. ఈ వివరాల్లోకి వెళితే..

తమిళనాడులో గత కొద్దిరోజులుగా రాజకీయ అనిశ్చితికి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సినీనటుడిగా తమిళ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు విజయ్. పార్టీ పెట్టిన 27 నెలలకే భారీ మెజార్టీతో అధికారానికి దగ్గరయ్యారు. ఎన్నికల్లో 108 సీట్లు సాధించిన టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ అందుకుని సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారని అంతా భావించారు. కానీ ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచి తమిళ రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి.

TVK Vijay Set to Become Tamil Nadu CM After Political Drama and Majority Support

సరైన సంఖ్యా బలం లేని కారణంగా విజయ్‌ ప్రమాణ స్వీకారానికి తమిళనాడు గవర్నర్ అనుమతించలేదు. ఒకటికి రెండు సార్లు గవర్నర్‌ను విజయ్ కలిసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. తొలుత ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని.. తర్వాత అసెంబ్లీలో బలనిరూపణకు వెళ్తామని గవర్నర్‌కు విజయ్ విన్నవించారు. అయితే పూర్తి సంఖ్యా బలంతోనే తన వద్దకు రావాలని గవర్నర్ తేల్చి చెప్పేశారు.

దాంతో విజయ్‌కి కేటాయించిన కాన్వాయ్, సెక్యూరిటీని తొలగించారు. అలాగే విజయ్ ఇంటి నుంచి రాష్ట్ర సచివాలయానికి వచ్చేందుకు సిద్ధం చేస్తోన్న హెలిపాడ్ పనులను కూడా అధికారులు పక్కనపెట్టేశారు. దీనితో పాటు జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో చేపడుతున్న ప్రమాణ స్వీకార ఏర్పాట్లను కూడా నిలిపివేయడంతో ఏం జరుగుతుందో అర్ధంకాక రాజకీయ వర్గాలు, ప్రజలు అయోమయానికి గురయ్యారు. డీఎంకే + ఏఐడీఎంకే ఒక్కటై విజయ్‌ని అధికారానికి దూరం చేస్తాయని, తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధిస్తారని, మరోసారి ఎన్నికలు అంటూ ప్రచారం జరిగింది.

విజయ్‌కి మద్ధతిచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ, వీసీకే, సీపీఐ, సీపీఎంలు ముందుకొచ్చాయి. అటు మాజీ సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ కూడా తాము అన్నాడీఎంకేతో కలిసే ప్రసక్తే లేదని.. విజయ్‌కి అవకాశం ఇవ్వాలని తన నిర్ణయాన్ని తేల్చిచెప్పేశారు. 6 నెలల వరకు విజయ్‌ని ఇబ్బంది పెట్టమని.. మా ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను ఆయన కొనసాగించాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. గవర్నర్ తీరుతో టీవీకే కార్యకర్తల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. లోక్‌భవన్ వద్దకు భారీగా తరలివచ్చిన టీవీకే కార్యకర్తలు.. ఆందోళన నిర్వహించారు.

అయితే శుక్రవారం ఉదయం నుంచి విజయ్ వేగంగా పావులు కదిపారు. తనకు మద్ధతు ఇవ్వాలని కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీలతో విజయ్ జరిపిన మంతనాలు ఫలితాన్చిచ్చాయి. టీవీకే అధినేత సంప్రదింపులతో సంతృప్తి పడిన లెఫ్ట్, కాంగ్రెస్, వీసీకేలు విజయ్‌కి మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించాయి. దాంతో కాంగ్రెస్ 5, సీపీఐ 2, సీపీఎం 2, వీసీకే 2 సభ్యుల బలంతో తమిళనాడు అసెంబ్లీలో టీవీకే బలం 118కి చేరుకుని ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

పూర్తి మెజార్టీని అందుకున్న విజయ్.. శుక్రవారం సాయంత్రం తమిళనాడు గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్‌ను కలిసి .. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు. దానికి గవర్నర్ ఆమోదముద్ర వేశారు. దీంతో మే 9 ఉదయం 11 గంటలకు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తద్వారా సినీ నటుడిగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత వంటి దిగ్గజాల సరసన విజయ్ చేరనున్నారు. విజయ్ ప్రమాణ స్వీకారానికి గవర్నర్ అంగీకారం నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా టీవీకే కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.

Read more about: thalapathy vijay tvk tamilnadu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X