Virat Kohli రెండో బిడ్డకు జన్మనిచ్చిన అనుష్కశర్మ.. ఆ క్రికెటర్‌కు లింక్ పెట్టి దారుణంగా మీమ్స్, ట్రోల్స్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దంపతులు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తొలి సంతానం వమికా తర్వాత అకాయ్ రూపంలో రెండో బిడ్గగా రావడంతో వారి కుటుంబంలో ఆనందానికి హద్దులేకుండా పోయాయి. అలాగే అభిమానుల్లో సంతోషం వెల్లివిరిసింది. అయితే అకాయ్ జన్మించిన వార్త వెలువడగానే అనుష్క శర్మ, విరాట్ కోహ్లీలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారారు. అయితే అనూహ్యంగా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కూడా ట్రెండింగ్‌లోకి రావడం సోషల్ మీడియాలో భారీ చర్చకు, అలాగే మీమ్స్‌కు అడ్డగా మారింది. ఏబీ డివిలీయర్స్ ఎందుకు ట్రెండ్ అవుతున్నారనే విషయంలోకి వెళితే..

అనుష్క శర్మ రెండోసారి గర్బవతిగా అయినప్పుడు దానిని విరాట్ కోహ్లీ కుటుంబ సభ్యులు సీక్రెట్‌గా పెట్టారు. చాలా రహస్యంగా ఈ వార్తను ఉంచి.. బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. కానీ క్రికెటర్ ఏబీ డీవిలియర్స్ ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో లీక్ చేసి హంగామా క్రియేట్ చేశారు. అయితే ఏబీ చెప్పిన మాటలను ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోలేదు.

Trolls on AB De Villers

అయితే ఏబీ డీవిలియర్స్ లీక్ చేసినప్పటికీ.. అఫీషియల్‌గా కన్ఫార్మ్ కాకపోవడంతో గాసిప్‌గా పరిగణించారు. కానీ ఫిబ్రవరి 15వ తేదీన తమ కుటుంబంలోకి ఓ మగబిడ్డ వచ్చాడు. అకాయ్ మా ఫ్యామిలీ సభ్యుడు కావడం ఆనందంగా ఉంది. మా జీవితంలో అంతా మంచి జరగాలని కోరుకొన్నవారందిరికీ ధన్యవాదాలు అని విరాట్ కోహ్లీ తెలిపారు.

అయితే ఏబీ డీవిలియర్స్ చెప్పిన వార్త నిజం కావడంతో నెటిజన్లు మీమ్స్‌తో హోరెత్తించారు. నేను చెబితే మీరు నమ్మడం లేదుగా ఫూల్స్.. ఇప్పుడు నా మాటే నిజమైంది అనే విధంగా డీవీలియర్స్ మీమ్స్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. దాంతో ఏబీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ కనిపించారు.

అయితే ఏబీ డీవిలియర్స్ రెండోసారి మామ అయ్యాడు అంటూ నెటిజన్లు మీమ్స్‌తో హోరెత్తించారు. కంగ్రాట్స్ కింగ్ కోహ్లీ, ఈ వార్తను మీరు ముందే చెప్పినందుకు థ్యాంక్స్ ట్వీట్లు చేశారు. ఏడీ డీవీలియర్స్ తర్వాత విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తమ రెండో సంతానం గురించి అధికారికంగా వెల్లడించారు అనే కామెంట్లు కనిపించాయి.

విరాట్ కోహ్లీ అధికారికంగా తన రెండో సంతానం కలిగిందని చెప్పిన తర్వాత మీమ్స్ సంచలనంగా మారాయి. నా జీవితంలో అబద్దం అనే పదానికి చోటులేదు అంటూ ఓ మీమ్‌ను ఏబీ డివీలియర్స్‌ను ఉద్దేశించి కామెంట్ చేశాడు. గతంలో తప్పుడు వార్తలను చెప్పాడని ట్రోల్ చేసిన వారు ఆయనను అభినందిస్తూ ట్వీట్లు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X