చిరంజీవిపై దారుణమైన కామెంట్స్... మామయ్య కాలిగోటికి సరిపోరంటూ మెగా కోడలు సీరియస్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. ఇటీవల రెండోసారి గర్భం దాల్చిన ఉపాసన జనవరి 31వ తేదీ రాత్రి హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో కవల పిల్లలకు జన్మనిచ్చారు. వీరిలో ఒక పాప, బాబు ఉన్నారు. మెగా వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లేలా రామ్ చరణ్‌కు వారసుడు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. చిన్నారుల రాకతో మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది. కొణిదెల, కామినేని కుటుంబాలు ఈ ఆనందాన్ని సన్నిహితులతో పంచుకుంటున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు ఆసుపత్రి వద్దే ఉంటూ మనవడు, మనవరాలిని చూసుకుని మురిసిపోతున్నారు. ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చారని, తల్లీ బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని చిరంజీవి తొలుత ట్వీట్ చేశారు. దాంతో సినీ ప్రముఖులు, అభిమానులు రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇదే సమయంలో చిరంజీవిపై సోషల్ మీడియాలో కొందరు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. దీనిపై మెగా కోడలు, వరుణ్ తేజ్ సతీమణి లావణ్య త్రిపాఠి సీరియస్ అయ్యారు.

చరణ్‌కు వారసుడు పుట్టడంతో మెగా ఫ్యామిలీ అంతా సంబరాలు చేసుకుంటోంది. అయితే చిరంజీవి గతంలో చేసిన వ్యాఖ్యల తాలూకా వీడియోలను మళ్లీ వైరల్ చేస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మెగా వారసత్వాన్ని రామ్ చరణ్ తర్వాత ముందుకు తీసుకెళ్లే వారసుడు కావాలంటూ మెగా అభిమానులు ఎన్నో ఏళ్లుగా కోరుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా తన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేలా చరణ్‌కు మగపిల్లాడు పుట్టాలని తన కోరికను బహిరంగంగానే వ్యక్తపరిచారు. దాంతో మెగాస్టార్‌పై అప్పట్లోనే ట్రోలింగ్ జరిగింది. ఇప్పుడు అందరి ఆశలు ఫలించి.. ఉపాసనకు పుట్టిన కవల పిల్లల్లో ఒక బాబు కూడా ఉండటంతో మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలో చిరు అన్న మాటలను గుర్తు చేస్తూ తమిళనాడుకు చెందిన ఓ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో ఆయనపై దారుణమైన కామెంట్స్ చేశాడు. రామ్ చరణ్ - ఉపాసనలకు తొలి సంతానంగా పుట్టిన క్లీంకారా విషయంలో చిరంజీవిలో ఇంత ఆనందం లేదని, ఇప్పుడు చరణ్ దంపతులకు మగబిడ్డ పుట్టడంతో చాలా సంతోషిస్తున్నారన్న కోణంలో సదరు విలేకరి ట్వీట్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగా అభిమానులను ఆయనను ట్రోల్ చేస్తున్నారు. ఇది కాస్తా మెగా కోడలు లావణ్య త్రిపాఠి దృష్టికి చేరడంతో ఆమె సీరియస్ అయ్యారు. ఈ మేరకు లావణ్య ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు.
నేను సాధారణంగా ఇలాంటి ట్వీట్‌లను పట్టించుకోకుండా నా టైమ్‌లైన్‌లో వాటిని వదిలేస్తాను. కానీ మీ నుంచి ఇటువంటిది నేను ఊహించలేదు. ఈ ట్వీట్ చాలా అసభ్యకరంగా ఉంది. నిజంగా సంతోషకరమైన క్షణాన్ని ఇబ్బందిగా మార్చేశావు. చిరంజీవి తన కుటుంబంలోని మహిళలతో, ముఖ్యంగా మనవరాళ్లతో ఎలా ఉంటారో మీకు తెలియదు. ఆడపిల్లలకు ఆయనిచ్చే గౌరవం, చూపించే ప్రేమలో.. ఆయన చేసే దానిలో కనీసం ఒక్క శాతం కూడా చేయగల మగాళ్లు చాలా తక్కువమందే ఉంటారు. తెలియని విషయాలపై, వ్యక్తులపై వ్యాఖ్యానించకపోవడం మంచిదని లావణ్య వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ దెబ్బకు సదరు జర్నలిస్ట్ తన ట్వీట్ డిలీట్ చేసినట్లుగా తెలుస్తోంది. అటు మెగా అభిమానులు కూడా గట్టిగా బుద్ధి చెప్పారు మేడం అంటూ లావణ్య త్రిపాఠిని మెచ్చుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











