సినీ నటి హేమ డ్రగ్స్ కేసులో అదిరిపోయే ట్విస్ట్.. హైడ్రామా మధ్య రేవ్ పార్టీ కేసులో.. !
డ్రగ్స్ కేసులో పట్టుబడిన సినీ నటి హేమకు ఊరట లభించింది. గత నెల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఆమె రెడ్ హ్యాండెడ్‌గా దొరకడంతో ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అయితే ఇటీవల ఆమెను అరెస్ట్ చేసి కస్టడీకి తరలించారు. అయితే కొద్ది రోజులుగా ఆమెను ప్రశ్నిస్తూ ఈ పార్టీకి సంబంధించిన వివరాలను సేకరించే పనిలో బెంగళూరు సెంట్రల్ క్రైమ్ పోలీసులు ఉన్నారు. అయితే కొద్దిరోజులుగా బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు లభించడంతో ఆమె తాజాగా కస్డడీ నుంచి బయటకు వచ్చారు. ఈ కేసులో చోటు చేసుకొన్న ట్విస్టుల వివరాల్లోకి వెళితే..
బెంగళూరులోని హెబ్బగోడిలో ఉన్న ఓ ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ నిర్వహించారు. ముందస్తు సమాచారంతో సెంట్రల్ క్రైమ్ పోలీసులు మెరుపుదాడి చేశారు. సుమారుగా 100 మందిని అదుపులోకి తీసుకొన్నారు. వారిని ప్రశ్నించిన తర్వాత విచారణకు హాజరుకావాలని చెప్పి.. విడుదల చేశారు. హేమపై కేసు నమోదు చేసి ఆమెను విచారణకు హాజరై దర్యాప్తుకు సహకరించాలని సూచించారు.

అయితే పలు దఫాలు విచారణకు రావాలని నటి హేమకు నోటీసులు పంపినా ఆమె స్పందించకపోవడంతో హైదరాబాద్‌కు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకొన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత బెంగళూరులో ఆమెను అరెస్టు చేసినట్టు ప్రకటించారు. అనంతరం ఆమెను రిమాండ్‌కు తరలించారు.
అయితే బెయిల్ కోసం ప్రయత్నించిన హేమ న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఆమె నుంచి ఎలాంటి డ్రగ్స్ స్వాధీనం చేసుకోలేదు. అలాగే ఆమెను అరెస్ట్ చేసిన చాలా రోజుల తర్వాత మెడికల్ పరీక్షలు నిర్వహించారు. అలాగే తన క్లయింట్‌కు ఎలాంటి సంబంధం లేదు అంటూ వాదించారు. అయితే న్యాయవాది వాదనలను పరిశీలించిన కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను ఎన్డీపీఎస్ స్పెషల్ కోర్టు మంజూరు చేశారు.

దాంతో హేమ రిమాండ్ నుంచి బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. పోలీసుల తెలిపిన ప్రకారం కండిషన్స్ ప్రకారం పిలిచిన వెంటనే విచారణకు హాజరుకావాలని, అలాగే వెల్లడించిన పోలీస్ స్టేషన్‌లో రిపోర్టు చేయాల్సి ఉంటుందని ఆమెకు తెలిపారు. అలాగే కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదనే షరతును కూడా విధించినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











