రాజ్ తరుణ్, లావణ్య కేసులో ట్విస్ట్.. నార్సింగి పోలీసులు రివర్స్ స్ట్రోక్
హీరో రాజ్ తరుణ్ వ్యవహారం ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో దుమారం రేపుతోంది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి రాజ్‌తరుణ్‌పై శుక్రవారం హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. 11 ఏళ్లుగా తాము రిలేషన్‌లో ఉన్నామని .. మరో యువతితో అఫైర్ పెట్టుకుని తనను నిర్లక్ష్యం చేసున్నాడని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించారని, 45 రోజులు జైల్లో ఉన్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
రాజ్ తరుణ్‌తో రిలేషన్‌లో ఉన్న మాల్వీ మల్హోత్రా అనే నటి, ఆమె సోదరుడు తనను బెదిరిస్తున్నారని.. రాజ్ తరుణ్ లైఫ్‌లోంచి వెళ్లకపోతే చంపుతామని వార్నింగ్ ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్ సీఎం తన తండ్రికి క్లోజ్ ఫ్రెండ్ అనీ.. తాము తలచుకుంటే ఏమైనా చేయగలమని నన్ను వారిద్దరూ బెదిరించారని లావణ్య ఆరోపించింది. మాల్వీ ట్రాప్‌లో పడి రాజ్ తరుణ్ తనకు దూరంగా ఉంటున్నాడని.. ఆయన లేకపోతే తాను ఉండలేనని తేల్చిచెప్పింది. రాజ్‌తరుణ్‌ని వదిలేస్తే కొంత డబ్బు ఇస్తామని, లేదంటే చంపేస్తారు మాల్వీ ఆమె సోదరుడు బెదిరిస్తున్నారని లావణ్య ఆరోపించింది.

లావణ్య ఫిర్యాదు చేసిన వెంటనే రాజ్ తరుణ్ మీడియా ముందుకు వచ్చి అంతే ఘాటుగా బదులిచ్చారు. తన జీవితంలో ఇవాళ్టీ దాకా డ్రగ్స్ ముట్టుకోలేదు, ఇకపైనా ముట్టుకోనని ఆయన స్పష్టం చేశారు. కావాలంటే నా హెయిర్ , బ్లడ్ శాంపిల్స్ ఇస్తానని రాజ్ తరుణ్ సవాల్ విసిరారు. లావణ్యను డ్రగ్స్ కేసులో ఇరికించేంత సీన్ తనకుంటే ఇవాళ తన జీవితం ఇలా ఉండేది కాదన్నారు. తన ఫ్రెండ్స్, నాతో పనిచేసిన దర్శకులకు లావణ్య ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతోందని .. దీనిపై లీగల్‌గానే ముందుకు వెళ్తానని రాజ్ తరుణ్ తెలిపారు.
లావణ్య మంచి వ్యక్తేనని.. తనకు చాలా సాయం చేసిందని అందుకు ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటానని ఆయన వెల్లడించారు. 2017 వరకు మాత్రమే శారీరకంగా, మానసికంగా రిలేషన్‌లో ఉన్నామని రాజ్ తరుణ్ వెల్లడించారు. కానీ తర్వాత తను డ్రగ్ అడిక్ట్ అయ్యిందని, చెడు స్నేహాలు చేస్తోందని దీంతో ఆమెను ఫ్లాట్ ఖాళీ చేయమన్నానని ఆయన చెప్పారు. ఇప్పుడు ఉంటున్న ఫ్లాట్‌ను దక్కించుకోవడానికే ఈ కేసు పెట్టి.. తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని రాజ్ తరుణ్ ఆగ్రహ వ్యక్తం చేశారు.

నేను లేనిది బతకనని చెబుతున్న ఆమె మస్తాన్ అనే వ్యక్తితో ఎందుకు డేటింగ్ చేస్తోందని ఆయన ప్రశ్నించారు. కన్న తండ్రినే ఆమె మోసం చేసిందని.. ఆమె తమ్ముడు తనకు చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్ అని ఆయన తెలిపారు. మరి వారు ఎవరి తరపున మాట్లాడతారో చూడాలన్నారు. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా తనకు క్లోజ్ ఫ్రెండ్ అని.. తనతో కలిసి నటించిందని ఆయన గుర్తుచేసుకున్నారు. అయినా ముంబైలో ఉండే ఆమెకు, హైదరాబాద్‌లో ఉండే తనకు లివ్ ఇన్ రిలేషన్‌షిప్ ఎలా సాధ్యమవుతుందని రాజ్ తరుణ్ ప్రశ్నించారు.
అయితే ఈ వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. రాజ్‌తరుణ్‌పై లావణ్య నిన్నే ఫిర్యాదు చేయగా.. సాయంత్రానికి లావణ్యకే పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు తమకు సమర్పించాలని 91 సీఆర్‌పీసీ కింద నార్సింగి పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు లావణ్య పోలీసులకు టచ్‌లోకి రాలేదని తెలుస్తోంది.

మరోవైపు రాజ్‌తరుణ్‌పై లావణ్య మరోసారి ఆరోపణలు చేసినట్లుగా కథనాలు వస్తున్నాయి. తనతోనే కాకుండా మరికొంతమంది అమ్మాయిలతో ఆయన రిలేషన్‌లో ఉన్నాడని ఆరోపించింది. రాజ్ తరుణ్ బండారాన్ని ఆధారాలతో సహా బయటపెడతానని , అలాగే ఆయన చెబుతున్న మస్తాన్ అనే వ్యక్తిని తీసుకొచ్చి మీడియా ముందు పెడతానని లావణ్య తేల్చిచెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. మరి మున్ముందు ఈ కేసు ఎలాంటి టర్న్ తీసుకుంటుందోనని ఫిలింనగర్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











