Jana Nayagan: జన నాయగన్ లీక్‌తో ట్విస్ట్.. విజయ్ మూవీకి అదే షాకింగ్ క్లైమాక్స్!
తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్ నటించిన తాజా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జన నాయగన్. తెలుగులో భారీ విజయం సాధించిన భగవంత్ కేసరి చిత్ర కథను ఆధారంగా చేసుకొని తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా అనేక మార్పులు, చేర్పులు చేసుకొన్న ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్వకత్వం వహించారు. ఈ సినిమాను కన్నడలో భారీ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కే నిర్మించారు.
ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవన్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సునీల్, రెబా మోనికా జాన్, బాబా భాస్కర్, రేవతి తదితరులు నటించారు. ఈ సిినమాకు సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. గత 7 నెలలుగా సెన్సార్ క్లియరెన్స్ కోసం నిర్మాత, దర్శకులు భారీగా న్యాయపోరాటమే చేశారు. ఈ ప్రాసెస్‌లో హీరో విజయ్ తమిళనాడు రాష్ట్రానికి సీఎం కావడం తెలిసిందే.

అయితే ఎట్టకేలకు ఈ సినిమా జూలై 23వ తేదీన రిలీజ్ అవుతుందని నిర్మాత వెంకట్ కే నారాయణ అధికారికంగా ప్రకటించారు. అయితే జాతీయ న్యూస్ ఛానెల్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పైరసీ గురించి, ఈ సినిమా క్లైమాక్స్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సినిమా పైరసీకి గురై లీక్ అయిన తర్వాత జరిగిన క్లైమాక్స్ మార్పుపై వివరణ ఇస్తూ..
మా హీరో విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు. తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టడం నిజంగా డెస్టినీగా భావిస్తాం. ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ సినిమా రిలీజ్ కావడం ఈ ట్విస్ట్‌తో కూడిన క్లైమాక్స్‌గా భావిస్తున్నాం అని నిర్మాత కేవీఎన్ తెలిపారు.
అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా క్లైమాక్స్‌ను పూర్తిగా మార్చివేశారు. లీకైన సినిమాకు సంబంధం లేకుండా ఈ సినిమా క్లైమాక్స్ ఉంటుంది. సినిమా ముగింపు బ్రాండ్ న్యూగా డిజైన్ చేశాం. ఈ సినిమాలో కొత్తగా చేర్చిన 41 సెకన్ల సన్నివేశానికి రీ సెన్సారింగ్ చేశారు. చివర్లో కొత్త అవతారంలో విజయ్ ఇచ్చే ట్విస్ట్ ఫ్యాన్స్‌కు పండుగలా ఉంటుంది అనే విషయం ప్రచారంలో ఉంది.
వాస్తవానికి ఈ సినిమాను జూలై 24వ తేదీన రిలీజ్ చేయాలని ముందుగా భావించారు. అయితే ఓవర్సీస్‌లో ఇతర సినిమాలు, హాలీవుడ్ సినిమాల రిలీజ్ కారణంగా అడ్జస్ట్ కాకపోవడంతో ఈ సినిమా రిలీజ్‌ను జూలై 23వ తేదీకి మార్చారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ పలు ప్రాంతాల్లో ఇప్పటికే గ్రాండ్‌గా ప్రారంభమైంది.


Click it and Unblock the Notifications