లావణ్యతో సహజీవనం కేసులో భారీ ట్విస్టు.. రాజ్‌తరుణ్ మరో ఎదురు దెబ్బ!
తెలుగు సినీ హీరో రాజ్ తరుణ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాము పెళ్లి చేసుకొన్నాం, కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నామని ఆరోపణలు చేస్తూ డ్యాన్స్ టీచర్ లావణ్య ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. వారిద్దరి మధ్య వివాదం కొన్ని వారాలపాటు టెలివిజన్ సీరియల్‌లా సాగింది. అయితే అంతా సద్దుమణుగుతుందని భావించిన నేపథ్యంలో తాజాగా పోలీసులు చార్జిషీట్ నమోదు చేయడంతో యువ హీరోకు షాకిచ్చినట్టు అయింది. కొత్త మలుపు తిరిగిన ఈ వివాద వివరాల్లోకి వెళితే..
రాజ్ తరుణ్‌తో సుమారుగా 10 ఏళ్లపాటు తాను సహ జీవనం చేసినట్టు లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. అయితే తనను వదిలేసి.. మరో హీరోయిన్‌తో సంబంధం పెట్టుకొన్నాడు. నాకు రాజ్ తరుణ్ కావాలి. ఆమెను వదిలేసి నాతో ఉండేలా చూడండి అంటూ కేసులో పేర్కొన్నారు.

అయితే లావణ్య తనపై చేసిన ఆరోపణలను రాజ్ తరుణ్ తోసిపుచ్చారు. తనతో విబేధాలు ఉన్నాయి. మరో వ్యక్తితో కలిసి ఆమె ఉంటుంది. నా ఫ్లాట్‌లోనే ఉంటూ మరోకరితో అఫైర్ పెట్టుకొన్నది. ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ ఆయన ఘాటుగా సమాధానం ఇచ్చారు. అయితే వారిద్దరి మధ్య పరస్పర ఆరోపణలతో వివాదం మరింతగా ముదిరింది.
అయితే తాజాగా లావణ్య పెట్టిన కేసుపై నార్సింగి పోలీసులు చర్యలు తీసుకొన్నారు. ఆమె ఫిర్యాదుపై స్పందించి.. ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేశారు. లావణ్య చెప్పిన ఫిర్యాదుపై దర్యాప్తు చేశాం. ఆ ఇంటి పరిసరాల్లో కొన్ని సాక్ష్యాలు సేకరించాం. వాటి ఆధారంగా మేము చార్జిషీట్ నమోదు చేశాం అని పోలీసులు తెలిపారు.

అయితే చార్ఝిషీట్ ప్రకారం.. 10 ఏళ్ల పాటు రాజ్ తరుణ్, లావణ్య ఒకే ఇంటిలో ఉన్నారు. లావణ్య ఫిర్యాదులో వాస్తవాలు ఉన్నట్టు గ్రహించాం. వాటి ఆధారంగా చార్జిషీట్ దాఖలు చేశాం. దాని ప్రకారం తదుపరి చర్యలు తీసుకొంటాం అని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ కేసులో రాజ్ తరుణ్ ఇప్పటికే ముందస్తు బెయిల్ తీసుకోవడం తెలిసిందే.


Click it and Unblock the Notifications











