Twist in Saif Ali Khan Attack: సైఫ్ మర్డర్ ఎటాక్‌లో షాకింగ్ ట్విస్ట్.. దేవర విలన్ బాడీలోనే కత్తి ముక్క!

బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ తన నివాసంలో కత్తిపోట్లకు గురి కావడం సినీ ప్రముఖులను, అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. తీవ్రమైన గాయాలకు గురైన ఆయనను వెంటనే మెరుగైన చికిత్స కోసం ముంబైలోని లీలావతి హాస్పిటల్‌లో చేర్పించారు. అయితే ఆయనపై దాడి ఘటన తర్వాత అనేక విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. దేవర యాక్టర్‌పై మర్డర్ అటాక్ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

అత్యంత హై సెక్యూరిటీ ఉన్న సైఫ్ నివాసంలోకి దోపిడి కోసం అగంతకుడు ప్రవేశించాడు. రాత్రంతా ఎవరికి కనిపించకుండా ఇంట్లోనే ఉన్నాడు. అర్ధరాత్రి అతడు కరీనా కుమారుడు జైష్ గదిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. ఇంట్లోకి అపరిచిత వ్యక్తి ప్రవేశించారని గమనించిన సిబ్బంది కేకలు పెట్టారు. దాంతో సైఫ్ ఆలీ ఖాన్ ఆ గదిలోకి పరుగెత్తుకొంటూ వచ్చాడు అని తెలిపారు.

Twist in Saif Ali Khan s Murder Attack Piece Of Knife Was Inside Body of Devara Actor

అయితే అగంతకుడి చేతిలో పదునైన ఆయుధం ఉండటం చూసి సైఫ్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. అయితే తన కుటుంబ సభ్యులకు హాని కలుగకుండా అడ్డుగా నిలిచాడు. అగంతకుడికి నచ్చ జెప్పే ప్రయత్నం చేశాడు. కానీ అతడు మొండికేయడంతో తన ఫ్యామిలీ మెంబర్స్‌ను వేరే గదిలోకి పంపించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే వెనక నుంచి కత్తిని వెన్నుముక ప్రాంతంలో దించాడు అని ప్రత్యక్ష సాక్షులు మీడియాకు తెలిపారు.

సైఫ్ వెన్నుముక ప్రాంతంలో బలంగా కత్తిని దించడంతో తీవ్రమైన గాయమైంది. కత్తికి సంబంధించిన చిన్న ముక్క వెన్నుముకలో విరిగిపోయి అక్కడే ఉండిపోయింది. వైద్యులు సర్జరీ చేసి ఆ ముక్కను తొలగించారు. ఈ కారణంగా రక్తస్రావం జరుగుతుండటంతో తగిన జాగ్రత్తలు తీసుకొన్నామని తెలిపారు. ఆయన గాయాలకు ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేశారు. ప్రస్తుతం ఆయన ప్రాణాలకు ముప్పు లేదు. ఆయన వైద్యానికి వేగంగా స్పందిస్తున్నారు అని వైద్యులు చెప్పారు.

Twist in Saif Ali Khan s Murder Attack Piece Of Knife Was Inside Body of Devara Actor

పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. సైఫ్ ఇంటిలో గత రెండు రోజులుగా ఫ్లోరింగ్ పాలిష్ పనులు జరుగుతున్నాయి. దాంతో కొంతమంది ఇంటిలోకి వచ్చిపోతున్నారు. ఆ వర్కర్లలో ఎవరైనా ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నాం. ఈ ఘటనలో సైఫ్ మహిళా సిబ్బంది కూడా గాయపడ్డారు అని పోలీస్ అధికారి తెలిపారు.

ఇదిలా ఉండగా, సైఫ్‌పై దాడి ఘటన తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, సోనుసూద్ తదితరులు ట్వీట్ చేసి త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆలియాభట్, రణ్‌బీర్ ఇతర బాలీవుడ్ ప్రముఖులు లీలావతి హాస్పిటల్‌కు వెళ్లి కరీనాను పరామర్శించి మరోధైర్యాన్ని కల్పించారు.

More from Filmibeat

Read more about: saif ali khan devara bollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X