Shefali Jariwala Death Case: షెఫాలీ జరివాలా మృతికేసులో ట్విస్ట్.. ఫొరెన్సిక్ రిపోర్టులో షాకింగ్‌ నిజాలు!

బిగ్‌బాస్ కంటెస్టెంట్, కాంటా లగా ఫేమ్ షెఫాలీ జరీవాలా మరణం భారతీయ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఆమె మృతిపై మీడియాలో రకరకాల కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న షెఫాలీ 42 ఏళ్ల చిన్న వయసులోనే తిరుగులేని లోకాలకు తరలిపోవడం అభిమానులను కలచి వేస్తోంది. ఆమె మరణించి 48 గంటల కావొస్తున్న ఇప్పటికే షెఫాలీ మృతి వెనుక అసలు వాస్తవాలేంటో తెలియరాలేదు. ఈ నేపథ్యంలో పోలీసుల చేతికి ఫోరెన్సిక్ నివేదిక అందింది? అందులో ఏముంది? ఎలాంటి వాస్తవాలు వెలుగుచూశాయి చూడాలి.

షెఫాలీ మృతితో బాలీవుడ్ షాక్
2002లో కాంటా లగా పాటతో రాత్రికి రాత్రి పాపులర్ అయిన షెఫాలీ జరివాలా శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన ముంబైలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే షెఫాలీ కన్నుమూసినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఆమె హఠాన్మరణంతో భారతీయ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురిచేసింది. సన్నిహితులు, సినీ ప్రముఖులు, అభిమానులు షెఫాలీకి సంతాపం ప్రకటించారు. అంత్యక్రియం సమయంలో షెఫాలీ భర్త పరాగ్ త్యాగి .. భార్యకు చివరిసారిగా ముద్దుపెట్టడం అందరినీ కలిచి వేసింది.

Twist in Shefali Jariwala Death Case Forensic Report reveals no foul play

సోషల్ మీడియాలో హల్‌చల్
మ్యూజిక్ ఆల్బమ్స్‌తో పాపులర్ అయిన షెఫాలీకి తొలుత సంగీత దర్శకుడు హర్మీత్ సింగ్‌తో వివాహం జరిగింది. అయితే వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న ఇబ్బందులతో ఈ జంట కొద్దిరోజులకే విడాకులు తీసుకుని విడిపోయింది. నటుడు పరాగ్ త్యాగితో పరిచయం ఏర్పడటంతో నాలుగేళ్లు ఆయనతో డేటింగ్ చేశారు. 2014 ఆయనను పెళ్లాడి మరోసారి వైవాహిక బంధంలో అడుగుపెట్టారు షెఫాలీ జరీవాలా. బిగ్‌బాస్ హిందీ 13లో కంటెస్టెంట్‌గా అలరించారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే షెఫాలీ హాట్ హాట్ ఫోటో‌షూట్‌లు, వీడియోలతో అభిమానులతో టచ్‌లో ఉండేవారు ఈ ముద్దుగుమ్మ. అలాంటిది షెఫాలీ అకాల మరణం వారిని బాధిస్తోంది.

షెఫాలీ మరణానికి కారణమేంటీ?
షెఫాలీ మృతికి ఖచ్చితమైన కారణం తెలుసుకునేందుకు పోలీసులు పలు కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. తొలుత గుండెపోటని, ఆ తర్వాత ఆమెకు చిన్ననాటి నుంచి ఉన్న మూర్ఛ వ్యాధి కారణమని వార్తలు వచ్చాయి. అనంతరం యాంటీ ఏజింగ్ ట్రీట్‌మెంట్ బెడిసికొట్టిందని గాసిప్స్ వైరల్ అయ్యాయి. శుక్రవారం ఇంట్లో పూజలు ఉండటంతో ఉపవాసం చేసిన షెఫాలీ.. ఎలాంటి ఆహారం తీసుకోకుండా యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ తీసుకోవడమే షెఫాలీ మృతికి కారణంగా భావించారు. కేసు దర్యాప్తులో భాగంగా షెఫాలీ భర్త పరాగ్ త్యాగి, ఇంటి పని మనుషులను విచారించారు పోలీసులు.

పోలీసుల చేతికి ఫోరెన్సిక్ రిపోర్ట్?
తాజాగా పోలీసుల చేతికి ఫోరెన్సిక్ నివేదిక అందినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీని ప్రకారం వైద్య పరమైన కారణాల వల్లే షెఫాలీ ప్రాణాలు కోల్పోయినట్లుగా భావిస్తున్నారు. ఆమె మరణం వెనుక ఎలాంటి కుట్ర కోణం ఉండకపోవచ్చని నిర్ధారణకు వస్తున్నారు. యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ ఆమె పాలిట శాపమైందని అంటున్నారు. ఇప్పటికే షెఫాలీ ఇంటి నుంచి యాంటీ ఏజింగ్ వయల్స్, విటమిన్ సప్లిమెంట్స్, గ్యాస్ట్రిక్ కేర్‌కు సంబంధించిన మెడిసిన్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు, సిబ్బంది, వైద్య నిపుణుల నుంచి 8 స్టేట్‌మెంట్‌లను పోలీసులు నమోదు చేశారు. షెఫాలీ మరణంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Read more about: Shefali Jariwala movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X