twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా టికెట్ రేట్ల వివాదంలో ట్విస్టు.. వైజాగ్‌లో నకిలీ లేఖల కలకలం.. ఏపీలో అసలేం జరుగుందంటే?

    |

    సినిమా పరిశ్రమలో భారీ బడ్జెట్, చిన్న సినిమాలు అనే బేధాలు లేకుండా థియేటర్లలో సినిమాలకు ఒకే ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రేక్షకులకు టికెట్ ధరలు అందుబాటులో ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నంబర్ 35 జారీ చేసింది. అయితే ఇటీవల జీవోకు వ్యతిరేకంగా కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు పిటిషన్ దాఖలు చేశారు. దాంతో జీవో 35 రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. సినిమా టికెట్‌ రేటు పాత విధానంలో అమలు చేయాలా? లేదా? అనే అంశం జిల్లా జాయింట్ కలెక్టర్ పరిధిలో ఉంటుంది. ఆయన ఆదేశాల మేరకు టికెట్ ధరలు నిర్ణయించాలని కోర్టు తీర్పులో పేర్కొన్నది. అయితే ఈ విషయంలో సరికొత్త ట్విస్టు బయటకు వచ్చింది. నకిలీ లేఖలు సృష్టించి కేసులు వేశారనే విషయం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.

    అయితే పిటిషన్ దాఖలు చేసిన సమయంలో కోర్టుకు సమర్పించిన లేఖలు నకిలీవని కొంతమంది ఎగ్జిబిటర్లు ఆరోపించడంతో పలు అనుమానాలకు దారి తీసింది. డిస్ట్రిబ్యూటర్లలో ఓ వర్గం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజలను, సినీ వర్గాల వారిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్న కొందరు డిస్టిబ్యూటర్లు ఘాటుగా స్పందించినట్టు సమాచారం.

    Twist in Ticket rates issue and GO 35 in Andhra Pradesh: Is fake letters submitted to High Court

    అయితే ఏపీ హైకోర్టును ఆశ్రయించిన విశాఖ జిల్లాకి చెందిన తొమ్మిది ఎగ్జిబిటర్లలో ఏడుగురు వారం రోజుల క్రితం నాకు ఫిర్యాదు చేశారు. అసలు విషయం చెప్పకుండా ఎగ్జిబిటర్లు అసోసియేషన్‌కి చెందిన చోడవరం థియేటర్‌ యాజమాని తమ దగ్గర సంతకాలు చేయించుకున్నారు. ఇదంతా మా ప్రమేయం లేకుండానే జరిగింది. ఈ నకిలీ లేఖ సమర్పించడంపై విచారణ చేయాలని జిల్లాకి చెందిన ఏడుగురు థియేటర్ల ఎగ్జిబిటర్లు కోరారు అని విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌తో చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    టికెట్ రేట్ల పెంపులో వెసులుబాటు కలిగించాలని కోర్టుని ఆశ్రయించిన వారిలో ఎవరూ కూడా ఇప్పటి వరకు తనని సంప్రదించలేదని జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి ఇప్పటికే వెల్లడించారు. సినిమా టికెట్‌ ధరల వ్యవహారంలో ప్రభుత్వ జీవోకు తామంతా ఆమోదయోగమే. నకిలీ లేఖ విషయాన్ని హైకోర్టుకి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని విశాఖ జిల్లాకి చెందిన ఏడుగురు ఎగ్జిబిటర్లు ఫిర్యాదులో తెలిపారు అని వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నట్టు సమాచారం.

    English summary
    Twist in Ticket rates issue and GO 35 in Andhra Pradesh: fake letters submitted to High Court comes under light. In this occasion, Vishaka JC Venugopal reddy reacted on this contraversy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X