2.5 కోట్లతోనే చిక్కుల్లో మహేష్ బాబు.. ఈడీ నోటీసుల వెనుక అసలు కథ అదే?
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. రియల్ ఎస్టేట్ కంపెనీపై మానీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో మహేష్ పేరు బయటకు రావడం సంచలనంగా మారింది. రియల్ ఎస్టేట్ కంపెనీలు భారీగా ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే విషయం ఈడీ విచారణలో వెలుగు చూడటంతో మహేష్ వ్యవహారం బయటకు వచ్చింది. అయితే మహేష్ బాబు తీసుకొన్న రెమ్యునరేషన్ ఎంత? వాటిలో చెక్ రూపంలో ఎంత? నగదు రూపంలో ఎంత? ఎంత మేరకు ఆర్థిక అవకతవకలు జరిగాయనే వివరాల్లోకి వెళితే..
తెలుగు రాష్ట్రాల్లో పేరు ప్రఖ్యాతులు ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీలు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ కంపెనీలు ఆర్థిక వ్యవహారాల్లో భారీగా అవకతవకలు ఉన్నాయనే విషయం బయటకు వచ్చింది. ఈ సంస్థ ఆర్థిక వ్యవహారాలు పరిశీలించిన తర్వాత పెద్ద ఎత్తున్న మనీ లాండరింగ్ జరిగిందనే విషయం దృష్టికి రావడంతో వారి అకౌంట్లపై ఆరా తీశారు. ఈ క్రమంలోనే వారు చేసిన చెల్లింపుల్లో మహేష్ బాబుకు ఇచ్చిన మొత్తాలు బయటకు వచ్చాయి. దాంతో ఆయనను విచారించాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

సదరు రియల్ ఎస్టేట్ కంపెనీలకు బ్రాండ్ ఎండార్సింగ్ చేసినందుకు గాను మహేష్ బాబుకు భారీగా రెమ్యునరేషన్ చెల్లించారు. నేషనల్ వెబ్ సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మహేష్ బాబుకు సుమారుగా 5.9 కోట్ల రూపాయలు చెల్లించారు. అందులో 3.4 కోట్ల రూపాయలు చెక్కు రూపంలో, 2.5 కోట్ల రూపాయలు నగదు రూపంలో చెల్లించారు. ఈ చెల్లింపు మొత్తాలపై క్లారిటీ లేకపోవడం వల్ల మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది అని మీడియాలో వార్త కథనాలు వెలువడుతున్నాయి.
అయితే మహేష్ బాబుకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ ఆయనకు చెల్లించిన నగదు మొత్తాలు అనుమానాస్పదంగా ఉన్నాయి. ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? ఎవరు చెల్లింపు చేశారు అనే కోణంలో ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. అందుకోసమే మహేష్‌కు నోటీసులు జారీ చేశారు అని టైమ్స్ ఆఫ్ ఇడియా తన కథనంలో పేర్కొన్నది.
అయితే సదరు రియల్ ఎస్టేట్ కంపెనీలు చేసిన వెంచర్లపై అనేక ఆరోపణలు రావడం, ఇన్వెస్టర్లను తప్పుదారిలో మోసగించే ప్రయత్నం జరిగింది. ప్లాట్ల అమ్మకాలు, ఫేక్ రిజిస్ట్రేషన్ లాంటి ఆరోపణలపై తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఈ కేసు మరింత వివాదాస్పదమైంది. ఈ కంపెనీని మహేష్ బాబు ప్రమోట్ చేసి కస్టమర్లను కొనుగోలు చేసే విధంగా ప్రమోట్ చేశారు అనే విమర్శలు కూడా రావడం గమనార్హం.
అయితే ఈడీ నోటీసుల నేపథ్యంలో సినిమా హీరోల బ్రాండ్ ప్రమోషన్స్ వ్యవహారం అత్యంత చర్చనీయాంశమైంది. ఈ కేసులో మహేష్ బాబు క్లీన్‌గా బయటకు వస్తారా? లేదా? అనేది అభిమానుల్లో, సిని వర్గాల్లో ఉత్కంఠ నెలకొన్నది. ఈడీ నోటీసులకు సూపర్ స్టార్ ఎలా స్పందిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా, దర్శక ధీరుడు రాజమౌళితో కలిసి ప్రస్తుతం మహేష్ బాబు ఓ సినిమాలో నటిస్తున్నారు. హైదరాబాద్, ఒడిశా ప్రాంతాల్లో ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకొన్నది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమార్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











