పోసానితో పోలీసుల అందర్ బాహర్ ఆట.. జైలులో చెడుగుడు మించి..!
తెలుగు సినిమా ప్రముఖ నటుడు అలాగే రచయిత కూడా అయినటువంటి పోసాని కృష్ణ మురళి కోసం తెలియని వారు ఉండరు. అప్పట్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకి కథలు, మాటలు అందించిన తాను తర్వాత నటుడుగా స్థిరపడ్డారు. పలు సినిమాలకి దర్శకత్వం కూడా తాను అందించినప్పటికీ అప్పుడు అందుకున్న గౌరవం అంతటినీ కూడా చేజేతులా పోసాని పోగొట్టుకున్నారని చెప్పక తప్పదు.
కాగా పోసాని కృష్ణ మురళి సినిమాల్లో ఎంత అలరించినప్పటికీ రాజకీయాల్లో మాత్రం పెద్ద ఎత్తున కాంట్రవర్సీలు రేపారు. కాగా తాను ఏపీలో వైసీపీ పార్టీకి మద్దతుగా ఎన్నో ఏళ్ళు నుంచి పని చేస్తుండగా ఇదే కోవలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తాను చేసిన దారుణ వ్యాఖ్యలు అపుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి.

పవన్ కళ్యాణ్ ని తన భార్య పిల్లలని సైతం పోసాని దారుణంగా మాట్లాడ్డం పవన్ ని తన అభిమానులకి బాగా బాధించింది. కాగా సీన్ కట్ చేస్తే ఇపుడు పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. పలు శాఖల్లో మంత్రి కూడా అయ్యారు. ఇక ఒకొక్కరిని ఏరడం స్టార్ట్ చేయగా తాము అధికారంలోకి వచ్చిన ఇన్ని నెలల తర్వాత పోసాని అరెస్ట్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.
కాగా ఏపీలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుంది అని వైసీపీ నేతలు అభిమానులు అంటున్నారు కానీ కూటమి నేతలు మాత్రం తాము కక్ష సాధింపులు చేస్తే అధికారంలోకి వచ్చిన మర్నాడే ఇవన్నీ ఉండేవి అని ప్రస్తుతం జరుగుతున్న అరెస్ట్ లు అంతా చట్టబద్ధంగా జరుగున్నావని తెలిపారు. కాగా ఇపుడు పోసాని కృష్ణ మురళీ ఏపీ పోలీస్ అదుపులో ఉండగా తన బెయిల్ కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇలా నెక్స్ట్ విచారణ రానున్న సోమవారం ఉండగా అప్పుడు తనకి బెయిల్ మంజూరు అయినప్పటికీ మళ్ళీ పోసాని జైల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని తెలుస్తుంది. కాగా ఇక్కడ ఊహించని ట్విస్ట్ ఏమిటంటే పోసాని ఇపుడు ఒక్క చోట కేసు విషయంలో జైల్లోకి వెళ్లాల్సి వచ్చింది. కానీ ఇక్కడ ఊహించని అంశం ఏమిటంటే పోసానిపై ఒక్క చోట కాదు పలు జిల్లాల్లో పలు పోలీస్ స్టేషన్ లలో చాలా కేసులు నమోదు అయ్యాయట.
దీనితో ఇపుడు బయటకి వచ్చినా కూడా మళ్ళీ పోలీసులు పోసానిని పట్టుకొని లోపల వేసేందుకు సిద్ధంగా ఉన్నారని చర్చ నడుస్తుంది. దీనితో పోసాని అంశంలో ఇదో క్రేజీ ట్విస్ట్ అనే చెప్పి తీరాలి. ఇలా తన కేసు విషయంలో అంతా ఏదో అందర్ బాహర్ ఆటలా మారింది అని చెప్పక తప్పదు.
మరి పోసాని ఈ కేసులో ఎలా బయటకి వస్తారు అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. ఇంకోపక్క తనకి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ అండ కూడా ఉందని టాక్ ఉంది. ఇలా ఎన్ని ఉన్నప్పటికీ పోసాని లాంటి అతన్ని జైలు నుంచి బయటకి రానివ్వకూడదు అని పవన్ అభిమానులు సహా క్లీన్ పాలిటిక్స్ కోరుకుంటున్న సామాన్య జనం కూడా భావిస్తున్నారు. అయితే పోసాని కృష్ణమురళిని రాజంపేట జైలు నుంచి నరదరావుపేటకు పీటి వారెంట్ పై తరలించారు.


Click it and Unblock the Notifications











