EAGLE: రవితేజ నుంచి ‘కిక్’ ఇచ్చే ట్రీట్.. తెలుగు సినిమాల్లోనే తొలిసారి ఇలా!
ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా ఏళ్ల పాటు ఎన్నో కష్టనష్టాలను అనుభించిన తర్వాత స్టార్‌గా మారి.. అప్పటి నుంచి టాలీవుడ్‌లో తనదైన మార్కును చూపిస్తూ దూసుకుపోతోన్నాడు మాస్ మహారాజా రవితేజ. హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న అతడు.. గత ఏడాది చివర్లో 'ధమాకా'తో కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అయితే, ఈ ఏడాది మాత్రం 'రావణాసుర' చిత్రంతో భారీ డిజాస్టర్‌ను చవి చూశాడు. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దూసుకుపోతూనే ఉన్నాడు.
ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ 'టైగర్ నాగేశ్వర్రావు' అనే పాన్ ఇండియా చిత్రాన్నిచేస్తున్నాడు. ఇది షూటింగ్ జరుపుకుంటూ ఉండగానే టాలెంటెడ్ గాయ్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో 'ఈగల్' అనే సినిమాను చేస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. ఇందులో ఎన్నో ఆసక్తికరమైన సన్నివేశాలను చూపించారు. ఫలితంగా ఈ చిత్రంపై అప్పుడే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్‌గా మారింది.

టాలీవుడ్ స్టార్ రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తోన్న చిత్రమే 'ఈగల్'. క్రైమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ న్యూస్ లీకైంది. దీని ప్రకారం.. ఈ మూవీలో రవితేజ పాత్ర కొన్ని వేరియేషన్లతో కూడి ఉంటుందట. ముఖ్యంగా అతడి పాత్ర చిత్రణ 'కిక్' సినిమాను గుర్తు చేసేలా డిజైన్ చేసినట్లు తెలిసింది. ఇక, అతడి నుంచి వచ్చే ట్విస్టులు సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయని తెలిసింది. అంతేకాదు, తెలుగులో ఏ సినిమాలో లేని విధంగా ప్రీ ఇంటర్వెల్ నుంచి ప్రతి 15 నిమిషాలకూ ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుందని అంటున్నారు. దీంతో ఈ చిత్రంపై హైప్ పెరిగిపోతోంది.

ఇక, 'ఈగల్' సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిబొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీనికి Davzand సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో నవదీప్, శ్రీనివాస్ అవసరాల, కావ్య తాపర్, మధు బాల సహా ఎంతో మంది ప్రముఖులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.


Click it and Unblock the Notifications











