For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మొన్న ఆ హీరోలను, ఇప్పుడు నానిని టార్గెట్ చేసిన రాహుల్.. మళ్ళీ అవే బూతులు.. రామరామ!

  |

  త్వరలో ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమా 'టక్ జగదీష్'. నేచురల్ స్టార్ నాని హీరోగా.. రీతు వర్మ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. అయితే ఈ ఏప్రిల్ లోనే విడుదల కావాలి కానీ, ఈలోపే సెకండ్ వేవ్ వచ్చి పడటంతో సినిమా విడుదల వాయిదా పడింది. ఎన్నో తర్జనభరజనల అనంతరం సినిమాను ఈ వినాయక చవితి కానుకగా.. ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఇక అదే రోజు మరో చిన్న సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతోంది .నటుడు రాహుల్ రామకృష్ణ నటించిన #NET కూడా అదే రోజు రిలీజ్ అవుతూ ఉండడంతో పెద్ద ఎత్తున రచ్చ చేశారు, ఈ ఇద్దరూ కలిసి రచ్చ చేశారు ఆ వివరాల్లోకి వెళితే

   మాకు మద్దతు ఇవ్వండి

  మాకు మద్దతు ఇవ్వండి

  గత కొద్ది రోజుల క్రితం బూతులతో విరుచుకుపడిన రాహుల్ రామకృష్ణ ఈరోజు వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. తన సినిమా ప్రమోషన్ కోసం రాహుల్ ఏమేం ట్వీట్లు చేసారో చూద్దాం, దేవుళ్ళు నిజంగా ఉన్నట్లయితే, వారు మా సినిమా #NET ని ప్రమోట్ చేస్తారు. ఎందుకంటే మా సినిమా మొత్తం మానవజాతి సంక్షేమం కోసం అని పేర్కొన్నారు, #NET ని అత్యంత అంకితభావంతో పనిచేసే సిబ్బంది-షూస్ట్రంగ్, హార్డ్ వర్కింగ్ ఫిల్మ్ మేకర్స్ రూపొందించారు, భార్గవ్ మాచర్ల రూపొందించిన ఈ కమర్షియల్ సినిమాలో మీరు చూసే మిగిలిన వారిలా కాకుండా, కథ చెప్పే ధైర్యం ఎవరికి ఉంది .. మాకు మద్దతు ఇవ్వండి! మంచి సినిమా ఎదగడానికి సహకరించండి! అంటూ ట్వీట్ చేశారు.

  పాపాత్ములు మాత్రమే

  పాపాత్ములు మాత్రమే

  మా సినిమా చూడటానికి మీకు ధైర్యం అవసరం, మీకు GలోD ఉంటే మా సినిమా చూడండి అని పేర్కొన్నారు. ధైర్యం అనేది స్పష్టంగా, వ్యావహారిక తెలుగు భాషలో వివిధ రకాలుగా రాయ బడుతుంది, మరియు ఉచ్ఛరించ బడుతుంది. ఆ పదాలు ఏమిటో మీకు తెలుసు, నేను మీకు మరింత చెప్పాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. మనం ప్రస్తుతం దేవుడికి భయపడే సాంస్కృతిక సమయంలో జీవిస్తున్నందున, పాపాత్ములు మాత్రమే నా ప్రేక్షకులను తయారు చేస్తారు కాబట్టి నా సినిమా చూస్తారని నేను నమ్మాలనుకుంటున్నాను. మీరు నన్ను నమ్మకపోతే- ఇది చూడండి అంటూ ఆయన తన సినిమా #NET పోస్టర్ షేర్ చేశారు.

  ఉత్తమమైన ఆఫర్

  ఉత్తమమైన ఆఫర్

  అలాగే కేసీఆర్ మీద బండి విరుచుకుపడ్డారు, ఫడ్నవిస్ ఏదో చెబుతున్నారు, రాహుల్ రామకృష్ణ చెప్పారు చూడండి'' ఇక నాని సినిమా టక్ జగదీశ్ కూడా అదే రోజున రిలీజ్ కాబోతుండగా నానిని ట్యాగ్ చేసి, నేను నీకు పెద్ద ఫ్యాన్ ని కానీ నా సినిమాకి ఉత్తమమైన ఆఫర్ ఉందని నేను నమ్ముతున్నాను'' అని పేర్కొన్నాడు.

  నా వల్లే సమస్య అయితే ఎల్లి పోత మావా

  నా వల్లే సమస్య అయితే ఎల్లి పోత మావా

  ఇక దానికి స్పందించిన నాని నా వల్లే సమస్య అయితే ఎల్లి పోత మావా ఈడి కెంచి అంటూ కామెడీ చేశాడు, వెంటనే స్పందించిన రాహుల్ రామకృష్ణ మీరు చూపిన దారికీ, దరువుకీ యెవరైనా కాదు అనగలరా సార్? అంటూ కృష్ణార్జున యుద్ధం నుంచి నాని పాటని గుర్తు చేస్తూ పేర్కొన్నారు. నా లాంటి చిన్న నటుడు నాని లాంటి సహజ నటుడయిన పెద్ద స్టార్ తో పోటీ పడుతూ సినిమా విడుదల చేసిన చివరిసారి ఎవరైనా నాకు చెప్పండి అని ప్రశ్నించారు.

  Recommended Video

  Harbhajan Singh లో ఇంత గొప్ప సింగర్ ఉన్నాడా.. రోజా మూవీ లో పాట పాడిన బజ్జీ
  గు*లో దమ్ము ఉంటే

  గు*లో దమ్ము ఉంటే

  ఇక నాకు ఎంత గు*లో దమ్ము ఉంటే ఇట్లాగా మాట్లాడుతా? మా సినిమా చూద్దాం! అని పేర్కొని మళ్ళీ, మీడియా కోసం బూతులు మాట్లాడడం లేదని క్లారిటీ ఇచ్చాడు. అలా అంటూనే మళ్ళీ గు*లో దమ్ము ఉంటే మా సినిమా చూడండోయ్'' అంటూ రాసుకొచ్చాడు. రాహుల్‌ రామకృష్ణ, అవికాగోర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన 'నెట్‌'. సినిమాలో లక్ష్మణ్‌ అనే వ్యక్తి పాత్రలో రాహుల్‌ కనిపించనున్నారు. అవికాగోర్‌.. ప్రియ అనే అమ్మాయి పాత్రలో నటించారు. అశ్లీల చిత్రాలు వీక్షించే రాహుల్‌ చివరికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? సీక్రెట్‌ కెమెరాల ద్వారా ప్రియ ప్రైవేట్‌ లైఫ్‌ని వీక్షించిన రాహుల్‌ ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు? లాంటి అంశాలను సినిమాలో చూపించారు.

  English summary
  Twitter Conversation Between Nani And Rahul Ramakrishna gone viral, as thier movies are set to release on 10th September.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X