For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sai Dharam Tej Accident: ప్రాణాపాయం తప్పడానికి వారిద్దరే ముఖ్య కారణం.. ఎవరంటే?

  |

  మెగా హీరో సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి వద్ద ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే చాలా తొందరగా హాస్పిటల్ కు తీసుకువెళ్లడం వల్లనే పెను ప్రమాదం తప్పిందని వైద్యులు చాలా క్లియర్ గా వివరణ ఇచ్చారు. ఏ ప్రమాదం జరిగినా కూడా మనిషిని వీలైనంతవరకు గోల్డెన్ టైమ్ లోనే హాస్పిటల్ కు తీసుకు వెళ్ల గలిగితే పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఆ సమయం ఎంత విలువైనదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సాయిధరమ్ తేజ్ ను వెంటనే హాస్పిటల్ కి తీసుకు వెళ్ళడానికి ఒక ఇద్దరు ప్రముఖంగా కారణమయ్యారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇద్దరికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. వారు ఎవరు అనే వివరాల్లోకి వెళితే..

  సహాయం చేసే గుణమున్న హీరో

  సహాయం చేసే గుణమున్న హీరో

  టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సాయి ధరమ్ తేజ్ కేవలం వెండితెరపైనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఎంతో మందికి సహాయపడ్డాడు. తన మామయ్యల తరహాలోనే లేని వాళ్ళకి తనవంతుగా సహాయం చేస్తూ ఉంటాడు. అయితే సాయి ధరమ్ తేజ్ చేసే మంచి పనులు ఎక్కువగా మీడియాలో కనిపించవు. గతంలో ఒక వ్యక్తి యాక్సిడెంట్ గురైనప్పుడు సాయి ధరం తేజ్ తన సొంత కారులో హాస్పిటల్ కి తీసుకు వెళ్లిన విషయం తెలిసిందే.

  షాపింగ్ మాల్ సెక్యూరిటీగార్డ్

  షాపింగ్ మాల్ సెక్యూరిటీగార్డ్

  తేజ్ కేబుల్ బ్రిడ్జి వద్ద ప్రమాదానికి గురైనప్పుడు అతని ముందుగా కాపాడేందుకు వచ్చింది మాత్రం ఒక సాధారణమైన సెక్యూరిటీ గార్డ్. రోడ్డుపై ఇసుక ఉండటంతో సాయి స్పోర్ట్స్‌ బైక్‌ హఠాత్తుగా స్కిడ్‌ అవ్వడం వల్ల బ్యాలెన్స్ కాలేకపోయింది.
  ఇక ఘటన స్థలంలో ఎంతోమంది ఉన్నప్పటికీ ఒక షాపింగ్ మాల్ సెక్యూరిటీ గార్డ్ మాత్రమే వెంటనే స్పంధించాడు. అతని పేరు అబ్దుల్. అక్కడ సమీపాన ఉన్న షాపింగ్ మాల్ అతను వ్యాలెట్‌ పార్కింగ్‌ చేస్తుంటాడట.

   మరొక వ్యక్తి కూడా బాద్యతగా..

  మరొక వ్యక్తి కూడా బాద్యతగా..


  అబ్దుల్ స్పందించి 108కు కాల్‌ చేసి తేజ్‌ ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడటంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే పది నిమిషాల్లో అంబులెన్స్‌ రావడంతో అతను దగ్గరుండి అంబులెన్స్ లోనే మెడికోవర్‌ ఆస్పత్రికి తరలించాడు. ఇక ప్రమాదం జరిగిన దగ్గరలోనే విధులు నిర్వర్తిస్తున్న ఇస్లావత్ గోవింద్ ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా వెంటనే స్పందించాడు. అతను ట్రాఫిక్ ను కంట్రోల్ చేయటం వలన అంబులెన్సు కూడా సకాలంలో ఆసుపత్రికి చేరింది.

  Hero Sai Dharam Tej యాక్సిడెంట్ పై స్పందించిన Actor Naresh || Filmibeat Telugu
  అందుకే ప్రాణాపాయం తప్పింది.

  అందుకే ప్రాణాపాయం తప్పింది.

  సరైన సమయంలో చికిత్స చేయడం వలన కూడా సాయి ధరమ్‌ తేజ్‌కు పెద్ద గండం నుంచి బయటపడినట్లు మొదట ట్రీట్‌మెంట్‌ చేసిన మెడికవర్‌ వైద్యులు తెలియజేశారు. నిజంగా గోల్డెన్ అవర్‌లోనే అతన్ని ఆస్పత్రికి తీసుకురావడమే కాకుండా, ఆ టైమ్‌లో ఇచ్చిన ట్రీట్‌మెంట్‌ కారణంగా సాయి తేజ్‌ ప్రాణాలతో బయటపడినట్లు తెలియజేశారు. ఎందుకంటే ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ఫిట్స్ రాగా, 108 వైద్యులు వెంటనే అతనికి ఇంజెక్షన్లు ఇవ్వటంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం అతని పరిస్థితి చాలా నిలకడగా ఉందని కంగారు పడాల్సిన అవసరం లేదని కూడా వైద్యులు వివరణ ఇచ్చారు. హీరో సాయిధర‌మ్ తేజ్ స‌ర్జ‌రీ స‌క్సెస్‌ అయ్యిందని కూడా తెలియజేశారు. కాల‌ర్ బోన్‌కు చికిత్స చేసిన వైద్యులు మ‌రో 24 గంట‌లు అబ్జ‌ర్వేష‌న్‌లో ఉంచుతామని అన్నారు.

  English summary
  Sai Dharam Tej under went Surgery for collar bone injury, Dr. Alok Ranjan & Team released a health bulletin regarding this.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X