NTR30: ఎన్టీఆర్ కోసం కొరటాల రిస్క్.. ఖర్చు ఎక్కువైనా ఒకేసారి రెండు చోట్ల రెడీ
యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, సాంగ్స్.. ఇలా ఎన్నో రకాల విద్యలను చూపిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చినా.. తన టాలెంట్లను చూపించి సత్తా చాటాడు. ఫలితంగా ఎన్నో విజయాలను కూడా సొంతం చేసుకున్నాడు. ఇక, గత ఏడాది వచ్చిన 'RRR' మూవీతో ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా ఎదిగిపోయాడు. అంతేకాదు, ఈ చిత్రం ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఫలితంగా తన రేంజ్‌ను మరింతగా పెంచేసుకున్నాడు.
'RRR' షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్నట్లు ప్రకటించాడు. కానీ, ఈ మూవీ మాత్రం అనుకున్న సమయానికి మొదలు కాలేదు. దీంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మధ్యనే చిత్ర యూనిట్ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతున్నట్లు తెలిపింది. అంతేకాదు, సినిమా షూటింగ్ కోసం లొకేషన్ల వెతకడంతో పాటు మ్యూజిక్ సిట్టింగ్స్‌ను కూడా పూర్తి చేసింది. ఇక, న్యూ ఇయర్ రోజు ఏకంగా ఈ మూవీని రిలీజ్ చేయబోయే డేట్‌ను కూడా ప్రకటించి సర్‌ప్రైజ్ చేశారు.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ గురించి చాలా రోజులుగా ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్నాయి. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి మొదటి వారం నుంచి ప్రారంభిస్తారని ప్రచారం జరిగింది. కానీ, దీన్ని మార్చి నెల నుంచి మొదలు పెట్టబోతున్నట్లు తాజాగా తెలిసింది. ఇందులో భాగంగానే మొదటి షెడ్యూల్‌ను శంషాబాద్‌లో ఏర్పాటు చేస్తోన్న భారీ సెట్‌లో జరపబోతున్నారట. ఆ వెంటనే రెండో షెడ్యూల్‌ను గోవాలో ప్లాన్ చేశారని తెలిసింది. ఈ రెండింటి కోసం ఇప్పటికే భారీ సెట్లను కూడా నిర్మిస్తున్నారట. అద్దె విషయంలో ఖర్చు ఎక్కువైనా షూట్ ఆలస్యం కాకుండా ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ - కొరటాల కాంబోలో రాబోయే ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేసే ఛాన్స్ ఉంది. దీన్ని 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











