సలార్ షూటింగ్ అప్‌డేట్: రెండు చోట్ల ప్లాన్ చేసిన యూనిట్.. ఏది కుదిరితే అక్కడే

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రభావం చూపుతోన్న హీరోల్లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సిరీస్ తర్వాత ఫుల్ ఫేమస్ అయిన అతడు.. అప్పటి నుంచి వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లోనే నటిస్తున్నాడు. ఇప్పటికే 'సాహో'తో ప్రేక్షకుల ముందుకు రాగా.. ప్రస్తుతం 'జిల్' ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే సినిమా చేస్తున్నాడు. ఇది పట్టాలపై ఉండగానే మరిన్ని భారీ ప్రాజెక్టులను ప్రకటించాడు. అందులో KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న 'సలార్' కూడా ఒకటి.

ప్రశాంత్ నీల్ - ప్రభాస్ కలయికలో రూపొందుతోన్న చిత్రమే 'సలార్'. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ గోదావరిఖనిలోని బొగ్గు గనుల్లో విజయవంతంగా పూర్తయింది. అక్కడ హీరో ఇంట్రడక్షన్ సీన్లతో పాటు ఓ యాక్షన్ ఎపిసోడ్‌ను కూడా చిత్రీకరించారు. దీని తర్వాత గ్యాప్ తీసుకున్న చిత్ర యూనిట్.. ఏప్రిల్ మొదటి వారం నుంచి మరో షెడ్యూల్‌ను ప్రారంభించబోతుందని తెలుస్తోంది. ఇందుకోసం శంషాబాద్‌లో ఒకటి.. గుజరాత్‌లో మరొకటి సెట్స్ వేస్తున్నారట. ఈ రెండింటిలో ఏది ముందుగా రెడీ అయితే అక్కడి షెడ్యూల్ ప్రారంభిస్తారని టాక్.

అమీరా దస్తర్ లేటేస్ట్ ఫోటో గ్యాలరీ... మరింత బ్యూటీ డోస్‌తో

Two Sets Ready for Prabhas Salaar

అప్పటి వరకు ప్రభాస్.. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తోన్న 'ఆదిపురుష్' షూటింగ్‌లో పాల్గొంటాడని అంటున్నారు. దీనితో పాటే 'సలార్' చిత్రీకరణకు కూడా అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ భారీ మూవీని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్. ఇందులో ప్రభాస్ రెండు విభిన్నమైన లుక్‌లతో కనిపిస్తాడని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ చిత్రాన్ని 2022 ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X