Just In
- 24 min ago
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు పండుగ లాంటి వార్త.. ఏకంగా రెండు ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్.!
- 1 hr ago
'సరిలేరు నీకెవ్వరు' మండే సర్ప్రైజ్.. అదరగొట్టేస్తున్న మూడో పాట
- 1 hr ago
'శివ 143' సాంగ్ లాంచ్ చేసిన స్టార్ డైరెక్టర్.. చిన్న సినిమాకి పెద్ద ప్రోత్సాహం
- 2 hrs ago
మహేష్, బన్నీ అభిమానుల రచ్చ రచ్చ.. మొగుడు, మగాడు అంటూ ఒకరిపై ఒకరు!
Don't Miss!
- News
పెండ్లి వేడుకలో డీజే మోతకు నో.. కేరళలో సీపీఎం సీరియస్ యాక్షన్
- Automobiles
కొత్తగా కొనుగోలు చేసిన బస్సులను తిరిగి ఇవ్వనున్న ఉత్తరాఖండ్ రవాణా శాఖ
- Sports
ICC Test rankings: కోహ్లీదే అగ్రస్థానం, బాబర్ అజామ్ తొలిసారి టాప్-10లోకి!
- Technology
కొత్తగా 'క్యాప్షన్ వార్నింగ్' ఫీచర్ ను ప్రారంభించిన ఇన్స్టాగ్రామ్
- Finance
అదే నిజమైతే ఉద్యోగుల్ని ఎప్పుడో తొలగించేవాళ్లం: టాటా మోటార్స్
- Lifestyle
వైరల్ : కదిలే గుర్రాన్ని గెలికితే.. ఏమవుతుందో ఈ వీడియోలో మీరే చూడండి...
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
సరికొత్త ప్రయోగం: మహేశ్ ఫ్యాన్స్‌కు పండుగ లాంటి వార్త.. ‘సరిలేరు’లో ఒకటి కాదు రెండు.!
తన గత చిత్రం 'మహర్షి' సూపర్ సక్సెస్ అవడంతో జోష్ మీదున్నాడు సూపర్‌స్టార్ మహేశ్ బాబు. ఈ ఫలితంతో అదే ఊపులో మరో సినిమాను పట్టాలెక్కించేశాడు. అదే.. 'సరిలేరు నీకెవ్వరు'. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో మహేశ్ ఆర్మీ మేజర్‌గా నటిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన లుక్స్, సాంగ్స్‌కు భారీ స్పదన వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది. తాజాగా దీనికి సంబంధించిన మరో న్యూస్ వైరల్ అవుతోంది.

ఆయన మార్క్ చూపిస్తాడట
‘సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మహేశ్ ఆర్మీ మేజర్‌గా కనిపించినప్పటికీ కామెడీ ట్రాక్‌కే పెద్ద పీట వేశారని తెలుస్తోంది. సీరియస్ బోర్డర్ సీక్వెన్సెస్ తర్వాత మహేష్ కాశ్మీర్ నుంచి ఇంటికి వచ్చే ఎపిసోడ్ ఆసక్తికరంగా ప్లాన్ చేశారట. ఇందుకోసం ట్రైన్లో మహేష్, ఇతర నటీనటులతో హిలేరియస్ కామెడీ పండించాలని డిసైడ్ అయిన అనిల్ రావిపూడి స్క్రిప్ట్ కూడా రెడీ చేశారట. మొత్తంగా ఈ సినిమా అనిల్ మార్క్ కంటెంట్‌తో వస్తుందట.

ఆమెది కీలక పాత్ర
‘సరిలేరు నీకెవ్వరు'లో విజయశాంతి కీలక పాత్ర చేస్తున్నారు. ఆమె చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుందట. అందులోనూ ఈ సినిమాలో విజయశాంతి పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. ఇటీవల విడుదల చేసిన పోస్టరే దానికి ఉదాహారణ. గతంలో కూడా విజయశాంతి ఈ తరహా పాత్రలు చేశారు. అప్పుడు ఆమెకు అవార్డులు కూడా వచ్చాయి. ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఈ లేడీ అమితాబ్ నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది.

సరికొత్త ప్రయోగం చేస్తున్నారు
సాధారణంగా కమర్షియల్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంటుంది. తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు ఇలానే ట్రెండ్ కొనసాగింది. అయితే, ‘సరిలేరు నీకెవ్వరు'లో మాత్రం రెండు స్పెషల్ సాంగ్స్ పెట్టబోతున్నారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన ట్యూన్స్‌ను మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఇప్పటికే రెడీ కూడా చేసేశాడని అంటున్నారు. ఇవి కూడా పక్కా మాస్ మసాలా సాంగ్స్ అని తెలిసింది.

మరో ఇద్దరు హీరోయిన్లు ఉంటారా?
‘సరిలేరు నీకెవ్వరు'లో రష్మిక నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే, ఈ ప్రాజెక్టులోకి తమన్నా కూడా ఎంటర్ అవుతుందని ఇటీవల ఓ వార్త బయటకు వచ్చింది. అయితే, ఆమె చేసేది ఓ స్పెషల్ సాంగ్‌కు మాత్రమేనని ప్రచారం జరిగింది. ఇక, తాజాగా ప్రచారం అవుతున్న దాని ప్రకారం తమన్నాతో పాటు మరో హీరోయిన్ను కూడా ఇంకో పాట కోసం తీసుకుంటున్నారట. అయితే, ఆమె ఎవరనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.

సరిలేరు నీకెవ్వరు గురించి
సూపర్ స్టార్ మహేశ్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు'. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. ఇందులో మహేశ్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. అలాగే ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. ఈ సినిమా ద్వారా లేడీ అమితాజ్ విజయశాంతి టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తోంది. అలాగే బండ్ల గణేష్ కూడా కీలక పాత్ర చేస్తున్నాడు.