బాలయ్య నుంచి ఆరోజు అదిరిపోయే సర్‌ప్రైజ్: ఒకేసారి రెండూ.. లేకుంటే అది గ్యారెంటీ
క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రూపొందించిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా అందుకోలేకపోయాడు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఇలాంటి పరిస్థితుల్లో తనకు బాగా కలిసొచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో 'అఖండ' అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దాదాపు 80 శాతం వరకూ పూర్తైంది. ఇక, ఇది పట్టాలపై ఉండగానే.. 'క్రాక్'తో బిగ్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు బాలయ్య. ఈ నేపథ్యంలో ఈ రెండు చిత్రాల గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది.
మే 28వ తేదీన నందమూరి తారక రామారావు జయంతి. దీనిని పురస్కరించుకుని 'అఖండ' సినిమాను విడుదల చేయాలని భావించాడు బాలయ్య. అయితే, కరోనా ప్రభావం కారణంగా ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. దీంతో ఈ సినిమా వాయిదా పడిపోయింది. ఈ నేపథ్యంలో ఆ స్పెషల్ డేన ఏదైనా ఒక అప్‌డేట్ ఇవ్వాలని భావిస్తున్నాడట. ఇందులో భాగంగానే 'అఖండ' సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. అదే సమయంలో గోపీచంద్ మలినేని ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుందని అంటున్నారు.

ఈ రెండు అప్‌డేట్లలో 'అఖండ' సాంగ్ మాత్రం కన్ఫార్మ్ అని తెలుస్తోంది. ఇప్పటికే థమన్ కంపోజింగ్‌లో పలు పాటలు పూర్తయ్యాయట. అందులో ఒక దానిని మే 28న విడుదల చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో పూర్ణ, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఇక, గోపీచంద్ తెరకెక్కించే సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











