‘ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీని బట్టబయలు చేస్తా.. నా ప్రాణం పోయే లోపు’ అంటూ
తెలుగు సినీ పరిశ్రమలోకి వరుస హిట్లతో తారాజువ్వలా ఎగిసిన హీరో ఉదయ్ కిరణ్ అర్ధాంతరంగా తనువు చాలించడం ఎంతో మందికి జీర్ణించుకోలేని విషయంగా మారింది. 1980, జూన్ 26వ తేదీన పుట్టిన ఆయన తన 33వ ఏట అంటే 2014, జనవరి 5వ తేదీన హైదరాబాద్‌లోని తన నివాసంలో సూసైడ్ చేసుకోవడం సంచలనం రేపింది. అయితే ఆయన బతికి ఉంటే 47వ పుట్టిన రోజు జరుపుకొనే వారని నెటిజన్లు గుర్తు చేసుకొంటున్నారు. ఆయన 47వ పుట్టిన రోజు సందర్భంగా ఉదయ్ కిరణ్ గురించిన కొన్ని విషయాలు, అలాగే ఆయన గురించి కొందరు మీడియాలో చెప్పిన వివరాలు మీ కోసం..
ఉదయ్ కిరణ్ విజయవాడలో జన్మించినప్పటికీ.. ఆయన విద్యాభ్యాసం సికింద్రాబాద్‌లో జరిగింది. ప్రాధమిక విద్య కేంద్రియ విద్యాలయం పికెట్, డిగ్రీని వెస్లీ డిగ్రీ కాలేజీ నుంచి అందుకొన్నారు. కాలేజీలో ఉండగానే.. మోడలింగ్ చేస్తూ సినిమాలపై ఆసక్తి పెంచుకొన్నాడు.అయితే తేజతో చిత్రం సినిమా చేయడం, ఆ సినిమా భారీ విజయం సాధించడంతో సినిమా అవకాశాలు వెతుక్కొంటూ వచ్చాయి.

చిత్రం విజయం తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే, కలుసుకోవాలని, శ్రీనామ్, నీ స్నేహం లాంటి చిత్రాలు వరుసగా విజయాలు సాధించాయి. దాంతో ఉదయ్ కిరణ్‌కు స్టార్ ఇమేజ్ రావడంతోపాటు తెలుగులో టాప్ యువ హీరోల్లో ఒకరిగా మారారు. ఆ సమయంలోనే చిరంజీవి కూతురితో పెళ్లి కుదరడం.. అనుకోకుండా ఆ పెళ్లి ఆగిపోవడం అందర్నీ షాక్ గురి చేసింది. ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దాంతో సినిమా అవకాశాలు సన్నగిల్లాయి.
అలాంటి పరిస్థితుల్లో పెద్దలు కుదిర్చిన వివాహంతో విషితా అనే యువతిని 2012 సంవత్సరంలో పెళ్లి చేసుకొన్నారు. అయితే వారి వివాహం సవ్యంగా సాగుతుందనే అందరూ భావించారు. కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌లో పెట్టేందుకు ప్రయత్నించారు. కానీ జనవరి 5వ తేదీ 214లో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడం సినీ, ప్రేక్షక వర్గాలను దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆయన లేరనే విషయం ఇప్పటికీ అందర్నీ వెంటాడుతూనే ఉంటుంది. తన మరణం గురించి సన్నిహితులు రకరకాలుగా మాట్లాడారు. వారిలో..
పెళ్లి ఆగిపోయిన తర్వాత ఉదయ్ కిరణ్ చాలా బాధలో కూరుకుపోయాడు. ఆ బాధలో ఉండగానే తల్లి మరణించింది. ఆ బాధలన్నీ దిగమింగుకొంటూ జీవితాన్ని భరించాడు. ఆ బాధలను భరించి ఎంత క్షోభించిపోయాడో.. లోలోపల ఎన్ని బాధలు పడ్డారో నాకు తెలుసు. వాడి స్థానంలో ఉండి ఆలోచిస్తే.. వాడు తీసుకొన్న సూసైడ్ నిర్ణయం కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎవరికీ సమాధానం చెప్పనక్కర్లేదు. నేను పోయాను. నాతోనే అంతా పోతుందని అనుకొన్నాడేమో. పోయిన తర్వాత ఎవరూ బాధపడినా అనవసరం అనుకొని ఉండొచ్చు అని నటి సుధ అన్నారు.
ఉదయ్ కిరణ్ కెరీర్ ఆరంభం నుంచి నాకు తెలుసు. నాతో అతడు సినిమాలు చేశాడు. ప్రతీ విషయం అతడి గురించి తెలుసు. అతడు ఆత్మహత్య చేసుకొనేందుకు కారణం ఎవరనేది అందరికి తెలుసు. అతడు ఆత్మహత్య చేసుకోవడానికి దారి తీసిన పరిస్థితులన్నీ నాకు తెలుసు. కానీ నేను ఇప్పుడు చెప్పను. నా గొంతులో ప్రాణం పోయే లోపు ఆ విషయాన్ని ప్రపంచానికి చెబుతాను. ఇండస్ట్రీలోను, మీడియాలోను అందరికి ఏం జరిగిందో తెలుసు. అంతా నాటకం ఆడుతున్నారు. నా నోటి నుంచి చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏదో రోజు ఆ మిస్టరీని బట్టబయలు చేస్తా అని దర్శకుడు తేజ అన్నారు.


Click it and Unblock the Notifications