Rajamouli- Uday Kiran: రాజమౌళి- ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సయిన సినిమా అదేనా?

Rajamouli- Uday Kiran: దర్శక ధీరుడు రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన ఘనుడు. ఒకప్పుడు తెలుగు సినిమాలు కేవలం సౌత్ వరకే పరిమితం అయ్యేవి. కానీ, రాజమౌళి ఎంట్రీతో తెలుగు సినిమా ఖ్యాతి ఏకంగా పాన్ వరల్డ్ వరకు చేరింది. రాజమౌళి డిక్షనరీలో 'ఫెయిల్యూర్' అనే పదమే లేదంటే అతిశయోక్తి కాదు. రాజమౌళి.. కేవలం స్టార్ హీరోలతోనే కాదు.. కమెడియన్ కూడా హీరోగా మార్చి కమర్షియల్ గా సక్సెస్ కొట్టగల సత్తా ఆయన సొంతం. ఆయన దర్శకత్వంలో ఒక్క సినిమాలోనైనా నటించాలని స్టార్ హీరోలు, హీరోయిన్స్ భావిస్తారు. ఆయన సినిమా కోసం ఎన్ని సంవత్సరాలు అయినా వేచి ఉంటారు. అలాంటి రాజమౌళి దివంగత హీరో ఉదయ్ కిరణ్ కోసం ఓ కథ రాసుకున్నారట. ఇంతకీ ఆ సినిమా ఏంటి? వారిద్దరు కాంబోలో మిస్ అయినా సినిమా ఏంటీ?

సినీ ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ ఓ ధ్రువతార. మొదటి సినిమా చిత్రం తోనే సూపర్ డూపర్ హిట్ అందుకుని ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుసగా లవ్ స్టోరీస్ చేస్తూ యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆయన నటించిన చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచాయి. దీంతో ఉదయ్ కిరణ్ పేరు టాలీవుడ్ లో మారుమోగింది. ఈ క్రమంలో వరస సినిమా ఆఫర్లు అందుకుంటూ విజయాలు అందుకున్నారు.

Uday Kiran Was First Choice For Rajamouli Nithiin combo Movie Sye

స్టార్ హీరోగా ఎదిగిపోయాడనే సమయంలో ఏం జరిగిందో తెలియదు. కానీ, వరసగా సినిమాలు దూరం కావడం, తాను నటించిన సినిమాలు ఫెయిల్ కావడం, దీంతో మార్కెట్లో అతని పాపులారిటీ పడిపోవడం, ఇలా క్రమంగా ఉదయ్ కిరణ్ డౌన్ పాల్ అయ్యాడు. అయితే.. కావాలని కొందరు అతనిపై కుట్ర చేశారని ఇండస్ట్రీలో టాక్. అయితే అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. కానీ, ఉదయ్ కిరణ్ కొన్ని స్వీయ తప్పిదాలు కూడా అతని డౌన్ పాల్ కారణమని కొందరు భావిస్తున్నారు.

అందులో ఉదయ్ కిరణ్ తన కెరీర్ పిక్ స్టేజ్ లో ఉన్నప్పుడు కొన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ ను మిస్ చేసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అలా దర్శకధీరుడు రాజ్యమౌళి ఆఫర్ కూడా ఉందట. టాలీవుడ్ లో యూత్ ను అట్రాక్ట్ చేసే హీరోలలో మొదటి వరుసలో ఉన్న ఉదయ్ కిరణ్ తో రాజమౌళి ఓ సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నాడట. స్టూడెంట్ నెంబర్ 1 సినిమా సమయంలోనే ఆ సినిమాకు సంబంధించిన స్టోరీ కూడా పూర్తి చేశాడట. ఈ కథ ఉదయ్ కిరణ్ వరకు కూడా వెళ్లిందట.

Uday Kiran Was First Choice For Rajamouli Nithiin combo Movie Sye

అయితే ఏమైందో తెలియదు. కానీ, ఉదయ్ కిరణ్ ప్లేస్ లో నితిన్ ను తీసుకున్నారట. ఆ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అదే సై.. ఈ మూవీ ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ గా మారిందో అందరికీ తెలిసిందే. నితిన్ కెరీర్ లో ఓ మైల్డ్ స్టోన్ గా నిలిచింది. ఒకవేళ ఇదే సినిమా నితిన్ కు బదులుగా ఉదయ్ కిరణ్ నటించిన.. ఉదయ్ కిరణ్ గ్రాఫ్ మరో లెవెల్ లో ఉండేది. ఆయనకు సినిమా ఆఫర్లు మరో విధంగా వచ్చేవి. రాజమౌళితో సినిమా చేసి ఉండి ఉంటే ఆయనకు ఆర్థికంగా కష్టాలు వచ్చేవి కావని మానసిక ఒత్తిడి ఉండేది కాదని ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ భావిస్తున్నారు.

నిజానికి ఉదయ్ కిరణ్ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్నాడు. ఆయన ఎంత త్వరగా స్టార్ హీరో అయ్యారో అంత త్వరగా డౌన్ పాల్ అయ్యారు. లవర్ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ మరణం ఇప్పటికీ ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారనేది కూడా వాస్తవం.

More from Filmibeat

Read more about: uday kiran rajamouli nithiin sye
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X