అతడు మూవీ ఉదయ్ కిరణ్ చేయాల్సిందా?.. ఆ నిర్మాతే అసలు విలన్.. బయటపెట్టిన మురళీమోహన్
సూపర్‌స్టార్ మహేశ్ బాబు కెరీర్‌తో పాటు తెలుగు సినిమా చరిత్రలో ఆల్‌టైం క్లాసిక్స్‌లో ఒకటి అతడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నేటికీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. థియేటర్‌లో కలెక్షన్స్‌తో పాటు బుల్లితెరపై ఎన్నిసార్లు ప్రసారమైనా భారీ టీఆర్పీలు అతడు మూవీ సొంతం. ఈ సినిమా మహేశ్ కెరీర్‌ను మలుపు తిప్పి మాస్, కుటుంబ ప్రేక్షకుల్లో ఆయనకు మరింత ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమాకు మహేశ్ కంటే ముందే మరో హీరోను అనుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..
కథ చెబుతుంటే నిద్రపోయిన పవన్
టాలీవుడ్‌లో స్టార్ రైటర్‌గా వెలుగొందుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మెగా ఫోన్ పట్టుకుని తొలుత నువ్వే నువ్వే పేరుతో ప్రేమకథను తీసి హిట్ కొట్టారు. ఆ తర్వాత ప్రేమకథలు కాకుండా యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ తీయాలని అనుకుని అతడు సినిమా కథ సిద్ధం చేసుకున్నారు. ఈ స్క్రిప్ట్‌ను తొలుత తన ప్రాణమిత్రుడు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు కథ చెప్పగా ఆయన తిరస్కరించారు. అంతేకాదు.. ఈ కథ చెబుతుండగా పవన్ నిద్రపోయారని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ సరదాగా చెప్పారు.

అతడుకు మహేశ్ గ్రీన్ సిగ్నల్
అయితే మహేశ్ బాబుకు వినిపించగా ఆయన వెంటనే ఓకే చెప్పేశారు. కానీ ఆ సమయంలో ఎస్‌జే సూర్యతో నాని సినిమా చేస్తుండటంతో మూడేళ్ల పాటు మహేశ్ కోసం వెయిట్ చేశారట త్రివిక్రమ్. ఎట్టకేలకు అన్ని అవాంతరాలను దాటుకుని మహేశ్ - త్రిషలు హీరో హీరోయిన్లుగా ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. సోనూ సూద్, నాజర్, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, సునీల్, కోట శ్రీనివాసరావు, సయాజీ షిండే తదితరులు కీలకపాత్ర పోషించారు. 2005 ఆగస్ట్ 10న రిలీజై సంచలన విజయం సాధించింది.
బుల్లితెరపై అతడు రికార్డ్
బాక్సాఫీస్ వద్ద రూ.22 కోట్ల కలెక్షన్స్‌తో పాటు 205 కేంద్రాలలో 50 రోజులు, 38 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. హైదరాబాద్ సుదర్శన్ 35 ఎంఎంలో 175 రోజులు ప్రదర్శించబడటంతో పాటు ఆ ఒక్క థియేటర్‌లోనే ఏకంగా రూ.1.40 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన అతడు డీవీడీలు అత్యధికంగా అమ్ముడై రికార్డు సృష్టించాయి. థియేటర్‌లలో విడుదలైన దాదాపు 7 ఏళ్ల తర్వాత స్టార్ మా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కాంట్రాక్ట్‌ను దాదాపు రూ.3.5 కోట్లు వెచ్చించి రెన్యువల్ చేయించుకోవడం విశేషం. టీవీలలో దాదాపు 1000 సార్లకు పైగా టెలికాస్ట్ కాగా ప్రతిసారి భారీ టీఆర్పీని సొంతం చేసుకుంది అతడు.
అతడు మిస్ చేసుకున్న ఉదయ్ కిరణ్
నిజానికి ఈ ఐకానిక్ మూవీలో ముందుగా హీరోగా అనుకున్నది ఉదయ్ కిరణ్‌ని. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ చిత్ర నిర్మాత మురళీ మోహన్ ఈ విషయాన్ని తెలియజేశారు. ఉదయ్‌ని తొలి సినిమాలో చూసినప్పుడే చాలా బుద్ధిమంతుడు, మంచి కుర్రాడు అనిపించిందని చెప్పారు. ఫోన్ చేసి నేను అభినందించగానే షాకై.. ఇంటికొచ్చి కలుస్తానని చెప్పి అప్పటి నుంచి తరచుగా వస్తూ పోతూ ఉండేవాడని మురళీ మోహన్ వెల్లడించారు. అతడు సినిమా స్క్రిప్ట్ రెడీ అయ్యాక ఉదయ్ కిరణ్‌ని హీరోగా అనుకున్నామని.. అయితే అప్పటికే చిరంజీవి గారి అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయ్యిందని మురళీ మోహన్ చెప్పారు.
ఆ నిర్మాత చేతిలో ఉదయ్ డైరీ
ఇంటికి అల్లుడు కాబోతుండటంతో అతని కెరీర్ దృష్ట్యా మెగా ఫ్యామిలీయే ఉదయ్ కిరణ్ డైరీని మెయింటైన్ చేసేవారని, ముఖ్యంగా అల్లు అరవింద్ దగ్గరుండి ఈ డైరీని పర్యవేక్షించేవారని మురళీ మోహన్ అన్నారు. తొలుత అతడు సినిమా చేస్తానని ఉదయ్ చెప్పాడని, కానీ అప్పటికే డేట్స్ ఫుల్ అయిపోవడంతో వచ్చే ఏడాది కుదురుతుందని తనతో అన్నాడని మురళీ తెలిపారు. దీంతో ఆ కథ మహేశ్‌కు నచ్చడం ఆయన ఓకే చెప్పడం, సినిమా విడుదలవ్వడం చకచకా జరిగిపోయాయని మురళీ మోహన్ బయటపెట్టారు. ప్రస్తుతం మురళీ మోహన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఒకవేళ ఉదయ్ కిరణ్ కనుక అతడు సినిమా చేసుంటే అతని కెరీర్ మరోలా ఉండేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











