Udumb ఫ్యాన్సీ రేటుకు తెలుగు రీమేక్ రైట్స్.. సొంతం చేసుకొన్న ప్రముఖ నిర్మాత ఎవరంటే?

టాలీవుడ్‌లో ఇతర భాషల చిత్రాల రీమేక్స్ జోరు కొనసాగుతున్నది. సంచలన విజయం సాధించిన అయ్యప్పునుమ్ కోషియం చిత్రాన్ని భీమ్లా నాయక్‌గా రీమేక్ చేయగా వంద కోట్ల వసూళ్లను సాధించింది. విక్టరి వెంకటేష్ "దృశ్యం, దృశ్యం-2"లతోపాటు ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక గాడ్ ఫాదర్, వేదాళం లాంటి చిత్రాలు మెగాస్టార్ చిరంజీవితో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మలయాళంలో ఘన విజయం సాధించిన ఉడుంబు చిత్రం తెలుగులో రిలీజ్ కావడానికి సిద్ధమైంది. ఆ వివరాల్లోకి వెళితే..

Udumb remake rights gets by Ganga Patnam Sridhar

ఉడుంబు తెలుగు రీమేక్ రైట్స్ ప్రముఖ నిర్మాత గంగపట్నం శ్రీధర్ సొంతం చేసుకున్నారు. శ్రీధర్ ఇంతకుముందు అంజలి టైటిల్ పాత్రలో చిత్రాంగద, సుమంత్ తో ఇదం జగత్ ఛార్మితో మంత్ర, మంగళ" లాంటి పలు చిత్రాలతోపాటు... సుకుమార్ "కుమారి 21ఎఫ్" చిత్రాన్ని కన్నడలో రీమేక్ చేసి విజయం సొంతం చేసుకున్నారు. తాజాగా రమ్యకృష్ణతో కన్నడలో "శివగామి" చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఉడుంబు చిత్రాన్ని మలయాళంలో కేటీ మూవీ హౌస్ పతాకంపై స్వీయ నిర్మాణంలో కేటీ తమరక్కుళం దర్శకత్వం వహించారు. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఉడుంబు మలయాళంలో అనూహ్య విజయం సాధించింది.
పలు అగ్రనిర్మాణ సంస్థలు ఉడుంబు తెలుగు రీమేక్ రైట్స్ కోసం పోటీపడినప్పటికీ... ఈ చిత్రం హక్కులు తమకు దక్కడంపై నిర్మాత గంగపట్నం శ్రీధర్ సంతోషం వ్యక్తం చేశారు.

ఉడుంబు రీమేక్ చిత్రం శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా పతాకంపై త్వరలోనే సెట్స్‌కు వెళ్లనుంది. దర్శకత్వ శాఖలో విశేష అనుభవం కలిగిన రత్నాకరం అనిల్ రాజు ఈ చిత్రం ద్వారా పరిచయం కానున్నాడు. ఇంకా టైటిల్ పెట్టని ఈ క్రేజీ చిత్రానికి ప్రస్తుతం స్క్రిప్ట్ పనులతోపాటు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది.

ఇప్పటి వరకు మలయాళంలో విజయం సాధించి తెలుగులో రీమేక్ అయిన చిత్రాలన్నీ దాదాపుగా ఇక్కడ కూడా అసాధారణ విజయం సాధించాయి. మళయాళంలో మంచి హిట్టయిన "ఉడుంబు" సినిమాకు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది.

మలయాళంలో భారీ విజయం నమోదు చేసిన "ఉడుంబు" చిత్రాన్ని ఇప్పటికే హిందీలో జాన్ అబ్రహాం రీమేక్ చేస్తుండగా... తమిళంలో ఓ సీనియర్ హీరోయిన్ తన తనయుడ్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ రీమేక్ చేస్తున్నారు!!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X