Leo First Review విజయ్ వన్ మ్యాన్ షో.. కానీ అదే మైనస్ అంటూ క్రిటిక్ రివ్యూ

తమిళ్ సూపర్ స్టార్, ఇళయ దళపతి విజయ్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న లియో చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్, సౌత్ ఇండియన్ స్టార్ అర్జున్, స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్, వాసుదేవ్ మీనన్ తదితరులు నటించిన ఈ సినిమా ఇప్పటికే అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతున్నది. ఈ క్రమంలో దుబాయ్‌కి చెందిన క్రిటిక్ ఉమేర్ సంధూ చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఉమేర్ సంధూ చేసిన ట్వీట్ వివరాల్లోకి వెళితే..

విజయ్ నటించిన లియో చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద భారీ క్రేజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దాదాపు 35 దేశాల్లో రిలీజ్ అవుతున్నది. యూరప్, నార్త్ అమెరికా, దుబాయ్, ఇండియాలో అత్యధికంగా స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను దాదాపు 12000 స్క్రీన్లలో రిలీజ్ కాబోతున్నది.

Umair Sandhu Critical Review on Vijays Leo movie

లియో సినిమా గురించి ఉమేర్ సంధూ ట్వీట్ చేస్తూ.. షార్ట్ రివ్యూ రాశాడు. లియో చిత్రం అవుట్ అండ్ అవుట్ విజయ్ అభిమానులను ఆకట్టుకొనే చిత్రం. సినిమా స్టార్ట్ మొదలైనప్పటి నుంచి విజయ్ ఫెర్ఫార్మెన్స్ వన్ మ్యాన్ షోగా ఉంటుంది. కథ పరంగా చిన్న పాయింట్‌తో సినిమాగా రూపొందించారు. పెద్దగా పాయింట్ లేకపోయిన కథనం, ఆ పాయింట్ చుట్టూ అల్లుకొన్న డ్రామా,యాక్షన్ పార్ట్ స్టన్నింగ్‌గా ఉంది అని ఉమేర్ సంధూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇక లియో సినిమాలో అన్ని ఎమోషన్స్ భారీగా మిక్స్ చేశారు. కథగా చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినా.. మూవీలో టెన్షన్, యాక్షన్, ఎమోషన్ మిళితం చేసిన తీరు బాగుంది. ఈ సినిమా అందరికి నచ్చే విధంగా రూపొందించారు. ఈ సినిమాకు నా రేటింగ్ 3.5/5 రేటింగ్ అంటూ కామెంట్ చేశాడు.

అయితే ఉమేర్ సంధూ రాసే ట్విట్టర్ రివ్యూలు వాస్తవానికి దూరంగా ఉంటాయి. గతంలో 4, 5 రేటింగులు ఇచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టాయి. ఈ సినిమాకు ఇచ్చిన రివ్యూపై నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉమేర్ సంధూ రేటింగ్ ఇచ్చాడంటే.. సినిమా కచ్చితంగా ఫ్లాపే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఉమేర్ సంధూ రాసిన ట్విట్టర్‌ రివ్యూను భారీగా ట్రోలింగ్ చేస్తున్నాడు. బీస్ట్ సినిమాకు 4 రేటింగ్ ఇచ్చాడు. అసలు ఇతను రివ్యూవర్ కాదు. నువ్వ సినిమా చూడకుండానే రివ్యూ రాశావా? అంటూ నెటిజన్లు రకరకాలుగా ఏకి పడేశారు. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా కొద్ది గంటలే ఉంది కాబట్టి.. మూవీ పరిస్థితి ఏమిటో త్వరలోనే తెలిసి పోతుంది..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X