twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Liger తర్వాత మరో డిజాస్టర్ బ్రహ్మస్త్ర.. ధర్మ ప్రొడక్షన్‌పై విరుచుకుపడ్డ క్రిటిక్

    |

    బాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన బ్రహ్మస్త్ర చిత్రం విడుదలకు సిద్దమైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు భారీ ఒపెనింగ్స్ నమోదయ్యాయి. సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మించారు. రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ జంటగా నటించిన ఈ చిత్రంలో నాగార్జున అక్కినేని, అమితాబ్ బచ్చన్ నటించారు. ఈ సినిమా గురించి క్రిటిక్, దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమేర్ సంధూ వరుసగా ట్వీట్లు చేస్తూ..

    బ్రహ్మస్త్రను టార్గెట్ చేస్తూ..

    బ్రహ్మస్త్రను టార్గెట్ చేస్తూ..

    బ్రహ్మస్త్ర గురించి దారుణంగా క్రిటిక్ ఉమేర్ సంధూ దారుణంగా కామెంట్స్ చేయడం షాకింగ్‌గా మారింది. ప్రతీ సినిమాకు భారీగా రేటింగ్ ఇచ్చే దుబాయ్‌కి చెందిన క్రిటిక్ బ్రహ్మస్త్రపై భారీగా కామెంట్స్ వదులుతున్నాడు. బ్రహ్మస్త్ర గురించి కామెంట్ చేస్తూ మెరిసేదంతా బంగారం కాదు అని కామెంట్ చేశాడు.

    స్టోరి, స్క్రీన్ ప్లే యావరేజ్

    స్టోరి, స్క్రీన్ ప్లే యావరేజ్

    బ్రహ్మస్త్ర గురించి మరో కామెంట్ చేస్తూ.. బాలీవుడ్‌లో ఫాంటసీ, అడ్వంచర్ సినిమాలు అరుదుగా వస్తుంటాయి. హిందీ పరిశ్రమ ఆలోచనకు అందని విధంగా సినిమాను రూపొందించాలనే ఆలోచన వచ్చినందుకు దర్శకుడు ఆయాన్ ముఖర్జీని అభినందించాలి. కానీ ఈ సినిమా స్టోరి, స్క్రీన్ ప్లే యావరేజ్. కొన్నిసార్లు బ్రహ్మస్త్ర చాలా గందరగోళంగా ఉంటుంది అని ఉమేర్ సంధూ పేర్కొన్నాడు.

    రెచ్చిపోయిన ఆలియాభట్, మౌనీ రాయ్

    రెచ్చిపోయిన ఆలియాభట్, మౌనీ రాయ్

    బ్రహ్మస్త్ర చిత్రంలో రణ్‌బీర్ కపూర్ చాలా కన్‌ఫ్యూజ్‌గా కనిపిస్తాడు. కథలో ఏం జరుగుతుందనే విషయం కూడా తెలియని విధంగా శివ పాత్రలో కనిపిస్తాడు. ఆలియా భట్ మాత్రం స్టన్నింగ్‌గా ఉంది. మౌనీరాయ్ తన ప్రతిభతో రెచ్చిపోయింది. ఆమె ఫెర్ఫార్మెన్స్ కిర్రాక్ అనిపించేలా ఉంది. అమితాబ్ చాలా గ్రేస్‌తో కనిపించాడు. ఒకటే బాధ ఏమిటంటే.. ఆయనకు స్క్రీన్ స్పేష్ చాలా తక్కువగా ఉంది అని ఉమేర్ సంధూ పేర్కొన్నాడు.

    లైగర్ డిజాస్టర్ తర్వాత

    లైగర్ డిజాస్టర్ తర్వాత

    ఇక బ్రహ్మస్త్రను నిర్మించిన కరణ్ జోహార్ సంస్థ ధర్మ ప్రొడక్షన్‌పై విరుచుకుపడ్డారు. లైగర్ డిజాస్టర్ తర్వాత బ్రహ్మస్త లాంటి సినిమాను అందించి మరోసారి ప్రేక్షకులను ఫూల్స్ చేయబోతున్నారా? అని ఉమేర్ సంధూ సెటైర్ వేశాడు.

    బ్రహ్మస్త్ర యావరేజ్ మూవీ అంటూ

    బ్రహ్మస్త్ర యావరేజ్ మూవీ అంటూ

    బ్రహ్మస్త్ర చిత్రం ఓవరాల్‌గా యావరేజ్ సినిమా. మ్యూజిక్, వీఎఫ్ఎక్స్, కొన్ని యాక్షన్ సీక్వెన్స్ బాగా చిత్రీకరించారు. వాటి కోసం ఈ సినిమాను చూడాలి. నా రేటింగ్ ఈ సినిమాకు 2.5/5 అంటూ వరుస ట్వీట్లతో సోషల్ మీడియాలో హల్ చల్ చేశాడు.

    English summary
    Dubai's critic Umair Sandhu Shocking review on Alia Bhatt, Ranbir kapoor's Brahmastra movie. He said, The movie is average.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X