స్టార్ హీరోతో సహజీవనం.. పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ.. ఆ హీరోయిన్ ఎవరంటే?
సినీ పరిశ్రమ అఫైర్లు, డేటింగ్, లివింగ్ రిలేషన్‌ఫిప్ అనేవి అతి సాధారణంగా భావించే అంశాలు. స్టార్ హీరోలకు హీరోయిన్లకు మధ్య శారీరక సంబంధాలు, అలాగే నిర్మాతలకు సినీ తారలకు, దర్శకులకు స్టార్ హీరోయిన్లకు అఫైర్లు ఉండటం సహజంగానే కనిపిస్తాయి. అయితే సినిమా పరిశ్రమలో స్టార్ హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ వ్యవహారం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ అయ్యారనే రూమర్లు వినిపించాయి. వారిద్దరి మధ్య జరిగిన ప్రేమయాణం విషయానికి వస్తే..
హిందీ సినిమా పరిశ్రమలో ప్రముఖ నటుడి కుమారుడిగా వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని వచ్చి అనతికాలంలోనే స్టార్ హీరోగా మారారు. ఆయన నటించిన చిత్రాలన్నీ భారీ సక్సెస్ అందుకోవడంతో ఆయన కెరీర్‌కు ఢోకా లేదని అనుకొన్నారు. కానీ డ్రగ్స్ బారిన పడి కెరీర్‌ను, ఆరోగ్యాన్ని తప్పుదోవపట్టించాడు.

ఆ తర్వాత తండ్రి చేసిన ప్రయత్నాలతో మళ్లీ నటుడిగా తన కెరీర్‌ను గాడిలో పెట్టుకోలిగాడు. ఇదంతా చెప్పేది సంజయ్ దత్ గురించి.. భార్య క్యాన్సర్ వ్యాధితో పోరాటం సమయంలో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో ఆయనకు మాధూరీ దీక్షిత్ పరిచయం అయ్యారు. సాజన్ సినిమా షూటింగులో మానసికంగా, శారీరకంగా దగ్గరయ్యారు.
మాధురీ దీక్షిత్, సంజయ్ దత్ మధ్య విడదీయలేనంతగా బంధం ఏర్పడింది. వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని అనుకొన్నారు. ఇద్దరు సహజీవనం కూడా చేశారు. ఆ సమయంలోనే సంజయ్ దత్ ద్వారా మాధురీ ప్రెగ్నెంట్ అయిందని క్రిటిక్ ఉమేర్ సంధూ తాజాగా ట్వీట్ చేసి సంచలనం రేపాడు.
అయితే మాధురీ దీక్షిత్, సంజయ్ దత్ రిలేషన్‌కు సంజయ్‌పై కేసు బ్రేక్ వేసింది. ఆ సమయంలోనే ముంబై పేలుళ్ల వ్యవహారం బయటకు రావడంతో మాధురీ దీక్షిత్ వెనుకంజ వేశారు.సంజయ్ దత్ అరెస్ట్ కావడంతో వారి అఫైర్‌కు పూర్తిగా బ్రేకులు పడ్డాయి. ఇప్పటికీ వీరిద్దరి డేటింగ్ వ్యవహారంపై కథలుగా చెప్పుకొంటారు.
ఇక సంజయ్ దత్ లైఫ్ విషయానికి వస్తే.. మాన్యతా దత్‌ను 2008 సంవత్సరంలో వివాహం చేసుకొన్నారు. అప్పటి నుంచి వారిద్దరూ హ్యాపీగా మ్యారేజ్ లైప్ లీడ్ చేస్తున్నారు. ఇక మాధురీ దీక్షిత్ అమెరికాకు చెందిన డాక్టర్ శ్రీరామ్ నేనే వివాహం చేసుకొన్నారు. వారిద్దరూ ఎవరి జీవితాల్లో వారు సుఖంగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











