Animal First Review పవర్‌ఫుల్ యాక్షన్, అడల్డ్ డ్రామా.. నేషనల్ అవార్డు పక్కా..క్రిటిక్స్ రివ్యూ!
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధికంగా వేచి చూస్తున్న చిత్రం యానిమల్ (Animal). అర్జున్ రెడ్డి తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగ రూపొందించిన సినిమా కావడంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగినట్టే టీజర్, ట్రైలర్ మరింత బజ్ క్రియేట్ చేశాయి. ఇలాంటి అంచనాల మధ్య డిసెంబర్ 1వ తేదీన యానిమల్ మూవీ రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా సెన్సార్ తర్వాత క్రిటిక్ వెల్లడించిన వివరాలు, సినిమా విషయాల గురించిన వివరాల్లోకి వెళితే..
యానిమల్ సినిమాలో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు నటించారు. ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. అయితే మూగ పాత్రలో ఆయన సరికొత్త విలనిజాన్ని పండించారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే రణ్‌బీర్, బాబీ డియోల్ మధ్య సన్నివేశాలు పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నాయని ప్రమోషనల్ ఈవెంట్లలో సినీ ప్రముఖులు వెల్లడించడం తెలిసిందే.

యానిమల్ సినిమా ఫస్ట్ కట్ సుమారు 4 గంటలుగా ఉండేదని.. దానిని ఎడిట్ చేసి సందీప్ రెడ్డి వంగ 3 గంటల 21 నిమిషాల నిడివికి తగ్గించారు. ఇటీవల కాలంలో భారతీయ సినిమా రంగంలో అత్యంత నిడివి ఉన్న చిత్ర ఇదే అని సినీ పండితులు వివరించారు.

ఇదిలా ఉండగా, దుబాయ్ సెన్సార్ బోర్డు కోసం స్క్రీనింగ్‌లో క్రిటిక్‌గా చెప్పుకొనే ఉమేర్ సందూ తాను ఈ సినిమా చూశానని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ సినిమా గురించి తన అభిప్రాయాన్ని ట్వీట్ల రూపంలో పోస్టు చేశారు. ప్రతీ మూవీకి ముందుగా వెల్లడించినట్టే యానిమల్ సినిమా రివ్యూను చెప్పారు.
యానిమల్ సినిమా పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా. యూత్‌ను విపరీతంగా ఆకట్టుకొనే అంశాలు ఎన్నో ఉన్నాయి. పిచ్చి ఎక్కించే అడల్డ్ కంటెంట్‌తోపాటు పవర్‌ఫుల్ యాక్షన్ సీన్లు ఉన్నాయి. మ్యూజిక్ సూపర్ హిట్. స్క్రిప్టుకు తగినట్టే నటీనటులు ఫెర్ఫార్మెన్స్ అదిరిపోయేలా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్‌కు పరుగులు పెట్టించేలా చేస్తుంది అని ఉమేర్ సంధూ చెప్పారు.

2023లో యానిమల్ మూవీ నాకు ఫేవరేట్ సినిమా. ప్రేక్షకులకు షాకిచ్చేలా సినిమా ఉంటుంది. జాతీయ అవార్డు సంపాదించేంతగా రణ్‌బీర్ కపూర్ యాక్టింగ్ ఉంది. ఈ సినిమా ఆయన కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అవుతుంది అని ఉమేర్ సంధూ ట్వీట్ చేశాడు.
అయితే ఉమేర్ సంధూ సినిమా రివ్యూలు ఆకాశానికి, భూమికి మధ్య ఉండే తేడాలా ఉంటుంది. ఆయన చెప్పిన చాలా సినిమాల రివ్యూలు దారుణంగా ఉన్నాయి. ఆయన బ్లాక్ బస్టర్ అంటూ చెప్పే రివ్యూ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మారాయి. ఇలాంటి సమయంలో ఉమేర్ సంధూ రివ్యూపై నమ్మకం తక్కువగానే ఉంటుంది. త్వరలోనే ఫిల్మీబీట్ తెలుగు రివ్యూ కోసం వేచి చూడండి..


Click it and Unblock the Notifications











